ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA Raja Singh: న్యూ ఇయర్ పార్టీలపై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-12-29T06:28:18+05:30

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మళ్లీ సంచలన వ్యాఖ్యలు...

MLA Raja Singh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. (MLA Raja Singh) నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం భారతీయ సంస్కృతి కాదని ఎమ్మెల్యే రాజా సింగ్ బుధవారం అన్నారు. (Comment on New Year parties)ఈ మేరకు రాజాసింగ్ ఓ వీడియోను హైదరాబాద్‌లో (Hyderabad)విడుదల చేశారు.దేశంలోని యువకులు జాగ్రత్తగా ఉండాలని, జనవరి 1వతేదీన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవద్దని ఆయన సూచించారు. యువత తమ స్వస్థలం సంస్కృతి గురించి తెలుసుకోవాలని, భారతీయులది కానిది ఏదైనా వేడుకలు జరుపుకోవద్దని ఆయన కోరారు.

‘‘నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం భారతీయ సంస్కృతి కాదు, పాశ్చాత్య సంస్కృతి(western culture). ఇది 200 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించిన ప్రజల సంస్కృతి. ఇది చెడ్డ పద్దతి, యువకులు తప్పనిసరిగా తెలుసుకోవాలి’’ అని ఎమ్మెల్యే వీడియోలో పేర్కొన్నారు.ముహమ్మద్ ప్రవక్తను ఉద్ధేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ ఎమ్మెల్యే టి రాజా సింగ్‌ను బీజేపీ ఆగస్టు 23వతేదీన సస్పెండ్ చేసింది.మహ్మద్ ప్రవక్తపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనను పోలీసులు గతంలో అరెస్టు చేశారు.జైలు నుంచి విడుదలైన రాజాసింగ్ మళ్లీ నూతన సంవత్సర వేడుకలపై వ్యాఖ్యల వీడియోను విడుదల చేశారు

Updated Date - 2022-12-29T10:45:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising