ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy Vs Nirmala Sitharaman: రేవంత్ రెడ్డి ప్రశ్నకు నిర్మలమ్మ ఘాటు జవాబు

ABN, First Publish Date - 2022-12-12T15:45:32+05:30

కాంగ్రెస్ తెలంగాణా ఎంపీ రేవంత్ రెడ్డి పార్లమెంటులో అడిగిన ఓ ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) ఘాటుగా

Revanth Reddy, Nirmala Sitharaman
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కాంగ్రెస్ తెలంగాణా ఎంపీ రేవంత్ రెడ్డి పార్లమెంటులో అడిగిన ఓ ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) ఘాటుగా సమాధానం చెప్పారు. అమెరికా డాలర్‌తో పోల్చితే మన దేశ కరెన్సీ రూపాయి విలువ రోజు రోజుకూ తగ్గిపోతున్న విషయాన్ని ప్రభుత్వం గమనించిందా? అని ఆయన నిలదీశారు. దీనికి నిర్మల సోమవారం బదులిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూ ఉంటే పార్లమెంటులో కొందరికి అసూయగా ఉందని ఆరోపించారు.

భారత దేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, ఇది ప్రతిపక్షాలకు సమస్యగా మారిందని నిర్మల సీతారామన్ వాపోయారు. భారత దేశ అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరూ గర్వపడాలన్నారు. అయితే కొందరు మాత్రం దీనిని ఓ పరిహాసంగా, జోక్‌గా తీసుకుంటున్నారన్నారు.

రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న ఏమిటంటే, ‘‘భారత దేశ కరెన్సీ రూపాయి విలువ రోజు రోజుకూ క్షీణిస్తోంది. ఒక డాలర్‌కు రూ.83 స్థాయికి పతనమైంది. ఇంత క్షీణత నమోదు కావడం ఇదే మొదటిసారి. దీనిని ప్రభుత్వం గమనించిందా? ఈ పతనాన్ని నిలువరించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలేమిటి? ప్రభుత్వం వద్ద ఓ కార్యాచరణ ప్రణాళిక ఉందా?

2013లో అప్పటి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, నేటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.

‘‘నేడు రూపాయి ఐసీయూలో ఉంది. తమిళులు ఈ వ్యక్తిని ఢిల్లీకి ఎందుకు పంపించారో నాకు అర్థం కావడం లేదు’’ అని మోదీ 2013 అక్టోబరులో ట్వీట్ చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారని తెలిపారు. రూపాయిని ఐసీయూ నుంచి తిరిగి ఇంటికి తీసుకురావడానికి ప్రభుత్వం వద్ద కార్యాచరణ ప్రణాళిక ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు నిర్మల సీతారామన్ సమాధానం చెప్తూ, ప్రతి కరెన్సీతోనూ భారతీయ రూపాయి బలంగా ఉందని చెప్పారు. రిజర్వు బ్యాంకు విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగించిందని, డాలర్-రూపాయి హెచ్చుతగ్గులు మితిమీరకుండా చూసేందుకు మార్కెట్లో జోక్యం చేసుకోవాలని చెప్పారు.

భారతీయ కరెన్సీ రూపాయి సోమవారం ప్రారంభంలో అమెరికా డాలర్‌తో పోల్చితే 35 పైసలు తగ్గి, రూ.82.63 స్థాయికి దిగజారింది.

హిందీ వివాదం

తెలంగాణ నుంచి వచ్చిన సభ్యులకు హిందీ సరిగా రాదు (కమ్ జోర్ హై), నాకు కూడా సరిగా హిందీ రాదు (మేరా హిందీ భీ కమ్ జోర్ హై); సరిగా లేని హిందీ ప్రశ్నకి, సరిగా రాని హిందీలోనే జవాబు చెబుతాను అని నిర్మల అన్నారు. దాన్ని కులం కోణంలోకి మళ్లించి, తాను శూద్రుడ్ననీ స్వచ్ఛమైన హిందీ మాట్లాడేది బ్రాహ్మణవాదులేననీ రేవంత్ అన్నారు. ఈ వివాదంపై విశ్లేషకుల అభిప్రాయం ఏమిటంటే, తెలంగాణ వారి హిందీలో ఉర్దూ కలుస్తుంది కాబట్టి వారికి శుద్ధమైన హిందీ రాదనీ, తాను తమిళియన్‌ని కాబట్టి హిందీ సరిగా రాదనీ ఆమె మాటల్లోని అంతరార్థం అయి ఉండవచ్చునని, అందులో రేవంత్ రెడ్డి హిందీని అవమానించిందేమీ లేదని చెప్తున్నారు.

Updated Date - 2022-12-12T16:44:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising