ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Railways privatisation : రాహుల్ గాంధీ ట్వీట్‌లో అవాస్తవాలు : పీఐబీ

ABN, First Publish Date - 2022-11-13T14:19:14+05:30

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం ఇచ్చిన ట్వీట్‌లో అవాస్తవాలు ఉన్నాయని

Rahul Gandhi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం ఇచ్చిన ట్వీట్‌లో అవాస్తవాలు ఉన్నాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఆదివారం ప్రకటించింది. భారతీయ రైల్వేలలోని 151 రైళ్ళను ప్రైవేటీకరించారని గాంధీ పేర్కొన్నారని, ఇది పూర్తిగా తప్పు అని తెలిపింది. నిరాధారమైన అంశాన్ని ట్వీట్ చేశారని పేర్కొంది. రైల్వేలు తన ఆస్తుల్లో దేనినీ ప్రైవేటీకరించలేదని స్పష్టం చేసింది.

రాహుల్ గాంధీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, రైల్వేలు భారత దేశాన్ని అనుసంధానం చేస్తాయని, రోజుకు 2.5 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తాయని తెలిపారు. ఇది 12 లక్షల మందికి ఉపాధినిస్తోందన్నారు. ‘‘ప్రధాన మంత్రి గారూ, రైల్వేలు భారత దేశ ఆస్తి, దీనిని ప్రైవేటీకరించకండి, బలోపేతం చేయండి, అమ్మకండి’’ అని కోరారు. ఈ ట్వీట్‌తోపాటు జత చేసిన వీడియోలో భారత్ జోడో యాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి.

తెలంగాణాలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నపుడు కొందరు రైల్వే యూనియన్ సభ్యులు ఆయనను కలిసినట్లు ఈ వీడియోలో ఉంది. రైల్వేల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారు ఓ వినతిపత్రాన్ని ఆయనకు సమర్పించినట్లు కనిపిస్తోంది. రైల్వేల్లో ఏ భాగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని వారిని ఆయన ప్రశ్నించారు. అందుకు వారు బదులిస్తూ, రైల్వే స్టేషన్లు, రైల్వే వర్క్‌షాపులు, రైల్వే మెడికల్ ఆసుపత్రులు, రైల్వే ఎస్టాబ్లిష్‌మెంట్లను ప్రైవేటీకరిస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడు ప్రైవేటీకరించాలని ప్రణాళిక రచించారు? ఇప్పటికే నెమ్మదిగా ప్రైవేటీకరిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించినపుడు, వారు స్పందిస్తూ, ఇప్పటికే రైల్వేల ప్రైవేటీకరణ ప్రారంభమైందని చెప్పారు.

రైల్వే ఆస్తులను ఎవరికి ఇస్తున్నారు? పెద్ద కంపెనీలకా? చిన్న కంపెనీలకా? అని రాహుల్ అడిగినపుడు వారు స్పందిస్తూ, పెద్ద కంపెనీలకే ఇస్తున్నారన్నారు. ఇప్పటికే ప్రైవేటు రైళ్ళను తీసుకొచ్చారని, 151 రైళ్ళను ప్రైవేటీకరించారని చెప్పారు.

ఈ వీడియోలో కనిపిస్తున్న పత్రికలో 2019నాటి హెడ్‌లైన్ కనిపించింది. తాము ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, భారతీయ రైల్వేల 170 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ ప్రైవేటీకరణ గురించి వినలేదన రైల్వే యూనియన్ నేతలు చెప్పారు.

దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఆదివారం స్పందిస్తూ, ఓ ట్వీట్‌లో తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపింది. భారతీయ రైల్వేలలోని 151 రైళ్ళు, రైల్వేల ఆస్తులు, స్టేషన్లు, ఆసుపత్రులను ప్రైవేటీకరిస్తున్నట్లు ఆరోపించారని పేర్కొంది. ఈ ఆరోపణలు పూర్తిగా తప్పు అని తెలిపింది. భారతీయ రైల్వేలు తన ఆస్తుల్లో దేనినీ ప్రైవేటీకరించలేదని తెలిపింది.

Updated Date - 2022-11-13T14:24:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising