ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rishi Sunak: ప్రధాని మోదీ, యూకే పీఎం రిషి సునాక్ భేటీ ఖరారు !

ABN, First Publish Date - 2022-10-28T15:08:10+05:30

బ్రిటన్‌ కొత్త ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak), భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీల (Narendra Modi) భేటీ ఖరారైంది. ఇండోనేషియాలోని బాలి (Bali) వేదికగా నవంబర్‌లో జరగనున్న జీ-20 లీడర్‌షిప్ సమ్మిట్‌లో (G-20 leadership summit) ఇరువురూ ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు అంగీకారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బ్రిటన్‌ కొత్త ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak), భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీల (Narendra Modi) భేటీ ఖరారైంది. ఇండోనేషియాలోని బాలి (Bali) వేదికగా నవంబర్‌లో జరగనున్న జీ-20 లీడర్‌షిప్ సమ్మిట్‌లో (G-20 leadership summit) ఇరువురూ ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్.. ప్రపంచ ఆర్థిక శక్తులుగా వికసించేందుకు కలిసికట్టుగా పనిచేయడానికి అధినేతలు సమ్మతం తెలిపారు. ఇండోనేషియాలో జరిగే టీ20 సదస్సులో వీరివురూ పరస్పర చర్చలు జరుపుతారు’’ అని ప్రకటనలో పేర్కొంది.

కాగా కొత్తగా బ్రిటన్ పగ్గాలు చేపట్టిన రిషి సునాక్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా గురువారం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వ్యక్తిగతంగా శుభాభినందనలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ఇరుదేశాల మధ్య ‘ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్’ (FTA) అంశాన్ని రిషి సునాక్ దృష్టికి తీసుకెళ్లారు. పరస్పర సంభాషణ అనంతరం ఇరువురూ ట్విటర్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ఒప్పందం దీపావళి నాటికల్లా పూర్తవుతుందని అంతా భావించారు. కానీ బ్రిటన్‌లో అస్థిర ప్రభుత్వం కారణంగా ముందుకు కదల్లేదు.

Updated Date - 2022-10-28T15:08:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising