ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Narendra Modi: కాంగ్రెస్ ఓటుబ్యాంక్ రాజకీయాలపై మోదీ ఘాటు విమర్శలు

ABN, First Publish Date - 2022-11-27T19:36:28+05:30

ఉగ్రవాదాన్ని టార్గెట్ చేయమంటే కాంగ్రెస్ (Congress) తనను టార్గెట్ చేసిందని ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు.

Prime Minister Narendra Modi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఉగ్రవాదాన్ని టార్గెట్ చేయమంటే కాంగ్రెస్ (Congress) తనను టార్గెట్ చేసిందని ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. గుజరాత్‌ (Gujarat)లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉగ్రవాదాన్ని వాడుకున్నారని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఖేడాలో జరిగిన సభలో ప్రసంగించారు. సూరత్, అహ్మదాబాద్‌లో పేలుళ్లు జరిగి ప్రజలు చనిపోతుంటే ఉగ్రవాదాన్ని రూపుమాపాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని, అయితే ఉగ్రవాదాన్ని లక్ష్యం చేసుకోకుండా తనను టార్గెట్ చేశారని మోదీ ఆరోపించారు.

బాట్లాహౌస్ ఎన్‌కౌంటర్ వేళ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉగ్రవాదులకు మద్దతుగా కన్నీళ్లు కార్చారని మోదీ చెప్పారు. ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకుందన్నారు. అనేక ఇతర పార్టీలు కూడా సంతుష్టీకరణ చర్యలకు పాల్పడ్డాయని చెప్పారు.

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదాన్ని రూపుమాపుతున్నామని మోదీ చెప్పారు. 2014లో ప్రజలు బీజేపీకి ఓటు వేయడం వల్ల ఉగ్రవాదం అంతమౌతోందని చెప్పారు. ఉగ్రవాదులు కూడా సరిహద్దులు దాటాలంటే జంకుతున్నారన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం విడ్డూరమని మోదీ చెప్పారు. 25 ఏళ్లలోపు యువతకు కర్ఫ్యూ ఏంటో కూడా తెలియదని, బాంబు దాడుల నుంచి వారిని కాపాడుకోగలిగామని మోదీ చెప్పారు. కేంద్రంతో పాటు గుజరాత్‌లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉండటం వల్ల డబుల్ ఇంజిన్ సర్కార్లతో ఉగ్రవాదాన్ని సమర్థంగా అడ్డుకోవచ్చని మోదీ చెప్పారు.

182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి.

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో గెలిచి ఆరోసారి అధికారంలోకి వచ్చింది. 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకూ గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు.

Updated Date - 2022-11-27T19:36:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising