ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat Jodo Yatra : విద్వేష విపణిలో ప్రేమ దుకాణం : రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2022-12-21T13:49:26+05:30

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం బీజేపీపై నిప్పులు చెరిగారు.

Rahul Gandhi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం బీజేపీపై నిప్పులు చెరిగారు. ఆయన నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) హర్యానాలో ప్రవేశించిన సందర్భంగా నుహ్ (Nuh)లో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఈ యాత్ర ద్వారా విద్వేష విపణి (Market of Hate)లో ప్రేమ దుకాణాన్ని తెరుస్తోందని చెప్పారు. బీజేపీని పరోక్షంగా ప్రస్తావిస్తూ, భారత దేశంలో విద్వేషాన్ని వ్యాపింపజేయడం కోసం వీరు వెళ్లినపుడు, తమ భావజాలంగలవారు ప్రేమ, ఆప్యాయతలను వ్యాపింపజేయడానికి వెళతారని చెప్పారు.

ఈరోజుల్లో కాంగ్రెస్, బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల నేతలు, ప్రజల మధ్య అంతరం ఉందన్నారు. ప్రజల అభిప్రాయాలను వినవలసిన అవసరం లేదని నేతలు భావిస్తున్నారని, గంటల తరబడి ఉపన్యాసాలు ఇస్తున్నారని అన్నారు. ఈ యాత్రలో అటువంటి ప్రవర్తనను మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

తమిళనాడులోని కన్యా కుమారి నుంచి సెప్టెంబరు 7న ప్రారంభమైన ఈ యాత్ర రాజస్థాన్ నుంచి బుధవారం హర్యానాలో ప్రవేశించింది. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల గుండా ఈ యాత్ర సాగింది. చివరికి జమ్మూ-కశ్మీరులో ఈ యాత్ర ముగుస్తుంది.

Updated Date - 2022-12-21T13:49:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising