ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shiv Sena: సడన్‌గా పాట్నాకు వచ్చిన థాకరే.. ఎందుకంటే?

ABN, First Publish Date - 2022-11-23T18:22:14+05:30

శివసేన నాయకుడు ఆదిత్య థాకరే అకస్మాత్తుగా పాట్నాకు వచ్చారు.

Aditya Thackeray, Tejashwi Yadav
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: శివసేన (Shiv Sena) నాయకుడు ఆదిత్య థాకరే (Aditya Thackeray) అకస్మాత్తుగా పాట్నాకు వచ్చారు. ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav)ను కలుసుకున్నారు. రబ్రీదేవి నివాసంలో గంటకు పైగా చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ (Bihar CM Nitish Kumar)‌తో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలూ మీడియాతో మాట్లాడారు. న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తమ ముందున్న అతి పెద్ద సవాలని, ఇందుకోసం ఎంతైనా శ్రమిస్తామని తేజస్వీయాదవ్ చెప్పారు. తాము ఎంతో కాలంగా కలవాలనుకుంటున్నా కోవిడ్ కారణంగా కలవలేకపోయామని ఆదిత్య థాకరే చెప్పారు. తాము చాలా విషయాలపై చర్చించామని, రాజకీయాలు మాత్రం మాట్లాడుకోలేదని తేజస్వీని కలిశాక ఆదిత్య థాకరే స్పష్టం చేశారు. తమ స్నేహానుబంధం కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

యూపిఏతో శివసేన ఉద్ధవ్ వర్గం కటీఫ్ చెప్పే అవకాశముందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఆదిత్య థాకరే బీహార్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్ర పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వాతంత్ర వీర సావర్కర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో కలకలం రేగింది. సావర్కర్ పిరికివాడని, బ్రిటీష్ వారికి క్షమాపణ చెప్పారని రాహుల్ ఆరోపించారు. దీంతో సావర్కర్‌ను స్ఫూర్తిదాతగా చెప్పుకుంటోన్న శివసేన యూపిఏనుంచి తప్పుకోవచ్చని ప్రధాన మీడియాలోనూ కథనాలు వెలువడ్డాయి. సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలు మహావికాస్అఘాడికి విఘాతం కలిగించవచ్చని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా వ్యాఖ్యానించారు. దీంతో పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లైంది. అయితే రాహుల్ విమర్శలు చేసి వారం గడుస్తున్నా శివసేన మహావికాస్అఘాడి నుంచి తప్పుకోలేదు. ఇదే తరుణంలో ఉద్ధవ్ థాకరే తనయుడు ఆదిత్య థాకరే పాట్నా వచ్చి మహాఘట్‌బంధన్ నేతలను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బీజేపీతో దోస్తీకి గుడ్‌బై చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపిన జేడియూ మహాఘట్‌బంధన్ ఏర్పాటు చేసింది. నితీశ్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మహారాష్ట్రలో 2019లో కూటమిగా ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన బీజేపీ, శివసేన సీఎం స్థానం విషయంలో పేచీ పడ్డాయి. చివరకు శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహావికాస్అఘాడి ఏర్పాటు చేసుకుంది. రెండేళ్లకు పైగా ఉద్ధవ్ థాకరే సీఎంగా కొనసాగారు. అయితే ఉద్ధవ్ విధానాలు నచ్చని శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటు చేశారు. ఉద్ధవ్‌కు షాకిస్తూ బీజేపీతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే సారధ్యంలో ఎన్డీయే ప్రభుత్వం మహారాష్ట్రలో పాలన సాగిస్తోంది. కొద్ది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే మిగిలిన ఉద్ధవ్ థాకరే వర్గం చివరకు శివసేన పేరును కూడా కోల్పోయే ప్రమాదంలో పడి న్యాయపోరాటం చేస్తోంది.

2024 పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో యూపిఏ, ఎన్డీయే నేతలు పావులు చురుగ్గా కదుపుతున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు కాగానే కొద్ది రోజుల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత మళ్లీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై యూపిఏ, ఎన్డీయే నేతలు చర్చోపచర్చలు జరుపుతునే ఉన్నారు. 2024 ఎన్నికల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే, ప్రభుత్వ వ్యతిరేకతను అవకాశంగా తీసుకోవాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి. భారత్ జోడో యాత్ర ద్వారా పార్టీని పటిష్టం చేసుకోవడంతో పాటు మిత్ర పక్షాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నారు. ఆదిత్య థాకరే పాట్నా పర్యటన కూడా ఇదే కోవలోకి వస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - 2022-11-23T19:00:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising