ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India-Russia-America : జైశంకర్ సందేశంతో కంగుతిన్న అమెరికా

ABN, First Publish Date - 2022-11-09T14:30:05+05:30

రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తామని భారత దేశం స్పష్టం చేయడంతో అమెరికా కంగుతింది.

Ned Price, S Jaishankar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తామని భారత దేశం స్పష్టం చేయడంతో అమెరికా కంగుతింది. రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని పునరుద్ఘాటించింది. భద్రత, ఇంధనం విషయంలో రష్యా నమ్మదగిన దేశం కాదని అనేక దేశాలు గుర్తించాయని తెలిపింది. సమష్టి ప్రయోజనాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కోరింది. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ నిర్ద్వంద్వంగా మాట్లాడటంతో అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ ఈ విధంగా స్పందించారు.

విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్‌ (Sergey Lavrov)తో మంగళవారం చర్చలు జరిపారు. చమురు కొనుగోలు సహా వాణిజ్య, ఆర్థిక సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించారు. అదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోవాలని జైశంకర్ మరోసారి పిలుపునిచ్చారు. ఆహారం, ఇంధన భద్రత పట్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు.

రష్యా నుంచి తగ్గింపు ధరలకు చమురు, ఎరువులను భారత దేశం దిగుమతి చేసుకుంటుండటంపై పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2022 మార్చిలో మన దేశం దిగుమతి చేసుకునే చమురులో 0.2 శాతం చమురును రష్యా నుంచి తగ్గింపు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. సంప్రదాయంగా మన దేశానికి చమురును ఇరాక్, సౌదీ అరేబియా సరఫరా చేస్తుంటాయి. రష్యా నుంచి తగ్గింపు ధరకు చమురు వస్తుండటంతో, అక్కడి నుంచి కొనుగోలును పెంచింది. దీంతో మొత్తం దిగుమతి చేసుకుంటున్న చమురులో 22 శాతం చమురును అక్టోబరులో రష్యా నుంచి మన దేశం దిగుమతి చేసుకుంది.

ఈ నేపథ్యంలో అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ (Ned Price) బుధవారం మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్-రష్యా (Ukraine-Russia) యుద్ధాన్ని ఖండిస్తూనే, రష్యాతో వివిధ దేశాలు వ్యాపారం చేయడాన్ని ఏ విధంగా చూస్తున్నారని అడిగినపుడు, ఆయన స్పందిస్తూ, రష్యాపై ఆధారపడటాన్ని భారత దేశం తగ్గించుకోవాలని పునరుద్ఘాటించారు. ఇది సమష్టి ప్రయోజనాల కోసం అవసరమని చెప్పారు. ఇది రష్యా, భారత్ ద్వైపాక్షిక ప్రయోజనాలకు సంబంధించిన విషయం కూడానని తెలిపారు. రష్యా నమ్మదగిన దేశం కాదని చాలా దేశాలు గుర్తించాయన్నారు. భద్రతా సహాయాన్ని అందజేయడంలో రష్యా నమ్మదగినది కాదన్నారు.

రష్యాను విశ్వసించడాన్ని భారత దేశం తగ్గించుకోవాలని, అది కేవలం ఈ ప్రాంతానికి లేదా ఉక్రెయిన్‌కు మాత్రమే ప్రయోజనం కలిగించే విషయం కాదని అన్నారు. భారత్ సమష్టి ప్రయోజనాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని, ఆ దేశాన్ని నమ్మడాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. రష్యా తీరును గమనించిన నేపథ్యంలో ఇది భారత దేశ ద్వైపాక్షిక ప్రయోజనాలకు కూడా అవసరమని చెప్పారు.

Updated Date - 2022-11-09T14:30:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising