ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress : అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన

ABN, First Publish Date - 2022-11-25T15:11:21+05:30

రాజస్థాన్‌ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వివాదం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్

Ashok Gehlot, Sachin Pilot
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రాజస్థాన్‌ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వివాదం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), యువ నేత సచిన్ పైలట్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. గెహ్లాట్ ఓ న్యూస్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సచిన్‌ను ద్రోహి అని పదే పదే విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ (Congress) స్పందిస్తూ, ఇది అనూహ్య పరిణామమని, ఆశ్చర్యం కలిగించిందని పేర్కొంది.

గెహ్లాట్ ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఓ ద్రోహి ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేడన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం సచిన్ పైలట్‌ (Sachin Pilot)కు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వబోదన్నారు. కనీసం పది మంది ఎమ్మెల్యేలైనా లేని వ్యక్తికి, తిరుగుబాటు చేసిన వ్యక్తికి సీఎం పదవిని ఇవ్వబోదన్నారు. ఆయన పార్టీకి ద్రోహం చేశారని, ఆయన ద్రోహి అని చెప్పారు.

2020లో సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఓ పార్టీ అధ్యక్షుడు తన పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించడం భారత దేశంలో మొదటిసారి జరిగిందన్నారు. ఈ తిరుగుబాటుకు బీజేపీ (BJP) నిధులిచ్చిందన్నారు. అంతేకాకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సహా బీజేపీ పెద్ద నేతలు పైలట్‌ను ప్రోత్సహించారన్నారు.

తిరుగుబాటు చేసిన, ద్రోహి అయిన వ్యక్తిని ఎమ్మెల్యేలు సమర్థించరన్నారు. ఆయన ముఖ్యమంత్రి ఎలా కాగలరని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం గురుగ్రామ్ రిసార్ట్‌లో బస చేసిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.10 కోట్లు ఇచ్చినట్లు తన వద్ద రుజువులు ఉన్నాయన్నారు.

ఇదిలావుండగా, సచిన్ పైలట్ భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో కలిసి నడిచారు. అశోక్ గెహ్లాట్ గతంలో తనను ‘అసమర్థుడు’ అని వ్యాఖ్యానించారని, ఇప్పుడు ద్రోహి అంటున్నారని వాపోయారు. గెహ్లాట్ చేస్తున్న ఆరోపణలన్నీ తప్పు అని తెలిపారు. బీజేపీపై సమైక్యంగా పోరాడవలసిన సమయంలో ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గెహ్లాట్ వంటి సీనియర్ నాయకులు గుజరాత్ శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించాలన్నారు. ఆ రాష్ట్రంలో ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా గెహ్లాట్ వ్యవహరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడారు. ఆయన ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ, అశోక్ గెహ్లాట్ ఇంటర్వ్యూలో వాడిన కొన్ని పదాలు అనూహ్యమని చెప్పారు. ఈ విషయంలో చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారన్నారు. దీనిని చక్కదిద్దడం గురించి కాంగ్రెస్ నాయకత్వం చర్చిస్తుందన్నారు. తమది ఓ కుటుంబమని, అనుభవజ్ఞుడైన గెహ్లాట్‌తోపాటు, యువకుడైన సచిన్ కూడా తమకు కావాలని చెప్పారు. గెహ్లాట్ వాడిన కొన్ని పదాలు తనను కూడా ఆశ్చర్యానికి గురి చేశాయన్నారు.

Updated Date - 2022-11-25T15:11:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising