ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాహుల్‌కి శునకాల స్వాగతం.. ఎలా పలికాయో తెలుసా..

ABN, First Publish Date - 2022-12-02T20:14:53+05:30

కాంగ్రెస్ పార్టీ (Ccongress party) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘భారత్ జోడో యాత్ర’తో (Bharat Jodo Yatra) దూసుకెళ్తున్నారు. సెప్టెంబర్ 7, 2022న తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర.. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండోడియా, మధ్యప్రదేశ్: కాంగ్రెస్ పార్టీ (Ccongress party) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘భారత్ జోడో యాత్ర’తో (Bharat Jodo Yatra) దూసుకెళ్తున్నారు. సెప్టెంబర్ 7, 2022న తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర.. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ యాత్ర మొదలై 3 నెలలు సమీపిస్తున్నా రాహుల్ గాంధీలో ఏమాత్రం అలుపు కనిపించడం లేదు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల రాహుల్ గాంధీకి అపూర్వమైన స్వాగతాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం యాత్ర కొనసాగుతున్న రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోనూ ఆయనకి అలాంటి సాదరస్వాగతమే దక్కింది. పుష్పగుచ్ఛాలను నోట కరచిపెట్టుకున్న రెండు శునకాలు రాహుల్‌‌కు, భారత్ జోడో యాత్రకు సుస్వాగతం పలికాయి. ‘‘అడుగులు వేయండి.. దేశాన్ని ఐక్యం చేయండి’’, ‘‘ద్వేషాన్ని వీడండి.. భారత్‌ను ఏకం చేయండి’’ అనే సందేశాలు రాసివున్న రెండు బుట్టల పుష్పగుచ్చాలతో అవి రాహుల్‌ను ఆహ్వానించాయి. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ దృశ్యం మధ్యప్రదేశ్‌‌లోని అగర్ మాల్వా జిల్లా తాండోడియా పట్టణంలో శుక్రవారం జరిగింది.

ఈ కుక్కల వయసు ఆరు సంవత్సరాలు. వీటిల్లో ఒకదాని పేరు లిజో (Lizho), మరోదాని పేరు రెగ్జీ (Rexy). ఇండోర్‌కు చెందిన సర్వమిత్ర నచన్ ఈ శునకాల యాజమాని. యాత్రం కోసం ఏదైనా వినూత్నంగా చేయాలని తాము భావించామని, గాంధీకి స్వాగతం చెప్పేందుకు కుక్కలకు శిక్షణ ఇచ్చామని అతడు చెప్పాడు. భారత్ జోడో యాత్ర మొదలైన నాటి నుంచి ఫాలో అవుతున్నామని వెల్లడించారు. కాగా లిజో, రెగ్జీల నుంచి రాహుల్ పుష్పగుచ్ఛాలను స్వీకరించడమే కాకుండా వాటితో ఫొటోలు కూడా దిగాడు. రెండింటిలో ఒకదాని చైన్ పట్టుకొని కొన్ని అడుగులు వేశారు. పూల బొకేలు కరచిపట్టుకుని నడుస్తున్న కుక్కలను ఆయన ఆసక్తిగా పరిశీలించారు.

Updated Date - 2022-12-02T20:23:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising