ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Police suspended: మీ ఇల్లు ఎక్కడ.. అని జడ్జీని అడిగిన పోలీసులు.. చివరకు..

ABN, First Publish Date - 2022-10-28T20:39:58+05:30

ఉత్తరప్రదేశ్ న్యాయమూర్తి నిబంధనలు ఉల్లంఘించిన ఉత్తర్‌ప్రదేశ్ పోలీసుల సస్పెన్షన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రోటోకాల్(Protocol) నిబంధనలు ఉల్లంఘిస్తూ.. న్యాయమూర్తికి నేరుగా ఫోన్ చేసి మీ ఇల్లు ఎక్కడ అని అడిగిన పోలీసులు చివరకు సస్పెండ్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar pradesh) అంబేడ్కర్ నగర్‌ జిల్లాలో(Ambedkar Nagar district) గత ఆదివారం జరిగిన ఈ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ప్రకాశ్ సింగ్‌‌ జిల్లా పర్యటన సందర్భంగా భద్రత కల్పించేందుకు పోలీసు ఉన్నతాధికారులు.. ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకు బాధ్యతలు అప్పగించారు.

ఈ క్రమంలోనే వారు నేరుగా న్యాయమూర్తికి ఫోన్ చేసి.. ‘‘మీ ఇల్లు ఎక్కడ.. మీరు ఎక్కడికి వెళ్లాలి’’ అని అడిగారట. దీనిపై ఆగ్రహించిన న్యాయమూర్తి ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి చెప్పారు. అదే రోజు వారిని సస్పెండ్(Suspension) చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ముగ్గురిని సస్పెండ్ చేసినట్టు పోలీసుల ధ్రువీకరించారు. సదరు పోలీసులు నేరుగా ఫోన్‌లో జడ్జిని సంప్రదించడం సబబు కాదని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రోటోకాల్ ప్రకారం.. జడ్జి భద్రతా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అధికారులను అడిగి ఇలాంటి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే.. న్యాయమూర్తి ఫోన్ నెంబర్ వారికి ఎలా తెలిసిందనే దానిపై కూడా స్పష్టత లేదు.

Updated Date - 2022-10-28T20:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising