mental well-being : గర్భధారణ సమయంలో తల్లి మానసిక ఆరోగ్యాన్ని కాపాడే ఎనిమిది విషయాలు ఇవే..!
ABN, First Publish Date - 2022-10-28T10:25:35+05:30
తల్లికాబోతున్న ప్రతి స్త్రీ గర్భధారణ సమయంలో శరీరం శారీరకంగా, మానసికంగా కూడా చాలా మార్పులకు లోనవుతుంది.
తల్లికాబోతున్న ప్రతి స్త్రీ గర్భధారణ సమయంలో శరీరం శారీరకంగా, మానసికంగా కూడా చాలా మార్పులకు లోనవుతుంది. శరీరంలో జరిగే వివిధ రకాల హార్మోన్ల మార్పులు మూడ్ స్వింగ్స్ కు దారితీస్తుంది.
మూడ్ స్వింగ్స్ అంటే ఏమిటి?
గర్భధారణ సమయంలో మానసిక స్థితి మారడం అనేది గర్భిణీలలో సహజంగా జరిగేదే.. రోజంతా ఆందోళన, నిరాశ, తీవ్రమైన సమస్యకు దారితీస్తాయి.
1. గర్భిణీ స్త్రీలు అప్పుడప్పుడు ఆందోళనకు నిరాశకు లోనవుతూ ఉంటారు.
2. డిప్రెషన్: విచారం, కోపం అనేది అందరిలోనూ కలిగేదే.. కొందరిలో ఇది ఎక్కువగా ఉంటుంది. గర్భిణిలలో ఈ లక్షణాలు ఉన్నట్లయితే అది డిప్రెషన్ కు దారి తీస్తుంది. ఒత్తిడికి గురయ్యేలా చేస్తుంది.
3. ఆందోళన: చిన్న విషయాలకే ఆందోళన పడటం వల్ల రక్తప్రసరణలో మార్పులు జరిగే ప్రమాదం ఉంది. కొందరిలో తల్లి కాలేమనే ఆందోళనతో పాటు ప్రసవ సమయంలో కలిగే భయం, విరక్తి ఎక్కువ ఆందోళనకు గురిచేస్తాయి.
వీటితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చే ప్రమాదం ఉంది.
- బైపోలార్ డిజార్డర్
- ట్రామా-సంబంధిత ఒత్తిడి (PTSD)
- పానిక్ డిజార్డర్స్
- అబ్సెషనల్ కండిషన్ (OCD)
– తినడంపై నియంత్రణ కోల్పోవడం.
గర్భధారణ సమయంలో మానసిక ఆరోగ్య సమస్యల చికిత్స చాలా ముఖ్యమైనది.
1. ఒత్తిడి తెచ్చుకోకండి; అవసరమైనప్పుడు విరామం తీసుకుంటూ ఉండాలి.
2. ఖచ్చితంగా అవసరమైతే తప్ప, ఈ సమయంలో ఉద్యోగంలో మార్పులు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి.
3. చురుకుగా ఉండటం వ్యాయామం చేయడం చేయండి.
4. పోషకమైన భోజనం తినండి.
5. ఆత్మవిశ్వాసంతో సమయం గడపండి.
6. విశ్రాంతి తీసుకోండి.
7. గర్భిణీ తల్లిదండ్రులతో సమయాన్ని గడపడం, ఆహ్లాద వాతావరణంలో కాలాన్ని గడపడం ముఖ్యం.
8. చిన్న ఆరోగ్య సమస్య అయినా డాక్టర్ సలహాను అడగండి.
Updated Date - 2022-10-28T11:30:18+05:30 IST