ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్ర కళా వేదిక ఖతార్ వారి ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజనాలు

ABN, First Publish Date - 2022-10-30T12:57:08+05:30

ఆంధ్ర కళా వేదిక(Andhra Kala Vedika) ఖతార్ కార్యవర్గం కార్తీక మాసం (Kartikamasam) సందర్భంగా ఖతార్‌లోని తెలుగు వారందరి కోసం "కార్తీకమాస వనభోజనాలు" (Kartikamasam Vanabhojanalu) కార్యక్రమాన్ని ఈ నెల 28న (శుక్రవారం) మొట్టమొదటిసారి మెసయిద్‌లోని ఫామిలీ పార్క్‌లో నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఆంధ్ర కళా వేదిక(Andhra Kala Vedika) ఖతార్ కార్యవర్గం కార్తీక మాసం (Kartikamasam) సందర్భంగా ఖతార్‌లోని తెలుగు వారందరి కోసం "కార్తీకమాస వనభోజనాలు" (Kartikamasam Vanabhojanalu) కార్యక్రమాన్ని ఈ నెల 28న (శుక్రవారం) మొట్టమొదటిసారి మెసయిద్‌లోని ఫామిలీ పార్క్‌లో నిర్వహించారు. ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ఖతార్‌లోని తెలుగు వారి నుండి అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు. ఒక్కరోజు వ్యవధిలోనే ౩౦౦కి పైగా రిజిస్ట్రేషన్స్ చేసుకుని రికార్డు సృష్టించారు అని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ బృందం చేసిన కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమానికి సుమారు 450 మంది హాజరయ్యారని, ఎండను, సమయాభావాన్ని కూడా లెక్కచెయ్యకుండా విచ్చేసిన చిన్న పెద్ద అందరూ కార్యక్రమాన్ని ఆసాంతం ఆనందించారని అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ విజయవంతంగా నిర్వహించుకోటానికి సహకరించిన స్పాన్సర్స్‌కు సహకరించిన స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్స్)కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

పలువురు తెలుగు ప్రముఖులు, ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) జనరల్ సెక్రటరీ కృష్ణకుమార్, ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF) నుండి రజని మూర్తి, తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఖాజా నిజాముద్దీన్, తెలుగు బిజినెస్ అసోసియేషన్ అధ్యక్షులు లూఫ్తీ, సత్యనారాయణ మలిరెడ్డి, గొట్టిపాటి రమణ, హరీష్ రెడ్డి, తెలంగాణ గల్ఫ్ సమితి కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించే ఇలాంటి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని అభినందించారు.

కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీలలో(తంబోలా, టగ్ ఆఫ్ వార్, ట్రేజర్ హంట్, "ఒక్క నిమిషం తెలుగులో మాట్లాడు") గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. లక్కీ డ్రాలో గెలిచిన మొదటి ముగ్గురికి బంగారు నాణేలు(2 Grams) అందించారు. ఉసిరి చెట్టు కొమ్మల క్రింద రుచికరమైన సాంప్రదాయ విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులు విక్రమ్ సుఖవాసి, కేటీ రావు, వీబీకే మూర్తి, శిరీషా రామ్, సాయి రమేష్, సోమరాజు, రవీంద్ర, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అందరికి కృతజ్ఞతలు తెలియజేసి గ్రూప్ ఫొటోతో కార్యక్రమాన్ని ముగించారు.

Updated Date - 2022-10-30T13:05:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising