విమానంలో ప్రయాణిస్తూ చేసిన ఆ చిన్న పని వల్ల ఎంత పని జరిగిపోయింది.. 5ఏళ్లుగా ఈ వృద్ధుడు..
ABN, First Publish Date - 2022-11-17T15:39:59+05:30
ప్రస్తుతం ఆ వృద్ధుడి వయసు 66ఏళ్లు. ఐదేళ్ల క్రితం విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు తెలియకుండానే జరిగిపోయిన ఓ చిన్న మిస్టేక్ వల్ల మొన్నటి వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే తాజాగా వైద్యుడిని సంప్రదించడంతో అతడి సమస్య..
ఎన్నారై డెస్క్: ప్రస్తుతం ఆ వృద్ధుడి వయసు 66ఏళ్లు. ఐదేళ్ల క్రితం విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు తెలియకుండానే జరిగిపోయిన ఓ చిన్న మిస్టేక్ వల్ల మొన్నటి వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే తాజాగా వైద్యుడిని సంప్రదించడంతో అతడి సమస్య తీరిపోయింది. దీంతో ఎగిరి గంతేశాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆయన పేరు వాలెస్ లీ. ప్రస్తుతం ఈయన వయసు 66ఏళ్లు. బ్రిటన్‌కు చెందిన వాలెస్ లీకి ఐదేళ్ల క్రితం వరకు వినికిడి శక్తి బాగానే ఉండేది. కానీ గత ఐదేళ్లుగా తీవ్ర వినికిడి శక్తితో బాధపడుతున్నాడు. ఏవియేషన్ ఇండస్ట్రీలో పని చేయడం మూలంగానే వినికిడి శక్తి మందగించి ఉండొచ్చని భావించాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ డాక్టర్‌ను సంప్రదించాడు. తన సమస్య వివరించి.. మంచి మెడిసిన్స్ ఇవ్వాలని కోరాడు. దీంతో వైద్యుడు వాలెస్ లీ రెండు చెవులను పరిశీలించాడు. ఈ నేపథ్యంలో అతడి చెవిలో ఉన్న దాన్ని చూసి షాకయ్యాడు. ఓ చెవిలో ఇయర్ బడ్‌ను గుర్తించి.. అదే విషయాన్ని వాలెస్ లీకి చెప్పాడు. ఆ తర్వాత కొద్ది సమయం వరకు శ్రమించి.. ఆ ఇయర్ బడ్‌ను బయటకు తీసేశాడు. ఇయర్ బడ్‌ను చెవిలోంచి డాక్టర్ తొలగించగానే.. వాలెస్ లీ సమస్య తీరిపోయింది. గతంలో మాదిరిగా ప్రతి చిన్న శబ్దాన్ని అతడు వినగలిగాడు.
ఈ క్రమంలో వాలెస్ లీ స్పందించాడు. ఐదేళ్ల క్రితం తాను విమానంలో బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లినట్టు చెప్పాడు. ఆ సందర్భంగా ప్రయాణ సమయంలో ఎటువంటి శబ్దాలు వినిపించొద్దని.. ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేసి వాటిని ఉపయోగించినట్టు పేర్కొన్నాడు. ఆ ఇయర్ ఫోన్స్‌కు సంబంధించిన ఇయర్ బడ్ తన చెవిలోనే ఇరుక్కుపోయిన విషయాన్ని తాను గుర్తించలేదని వెల్లడించాడు. దీంతో గత ఐదేళ్లుగా వినికిడి సమస్యతో బాధపడినట్టు వివరించాడు. ఈ నేపథ్యంలో ఇతడికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
Updated Date - 2022-11-17T15:45:35+05:30 IST