NRI: ఎన్నారైలకు ఓటు హక్కుపై కేంద్రం చర్యలు
ABN, First Publish Date - 2022-11-02T07:04:59+05:30
ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), వలస కార్మికులకు ఓటు హక్కు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఎన్‌ఆర్‌ఐలకు ఓటు హక్కుపై కేంద్రం హామీ
న్యూఢిల్లీ, నవంబరు 1: ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), వలస కార్మికులకు ఓటు హక్కు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారు కూడా ఎన్నికల ప్రక్రియలో భాగమేనని, రహస్య ఓటింగ్‌ను కాపాడుతూనే వారికి ఓటు హక్కు కల్పిస్తామని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి తెలిపారు. దాంతో ఈ విషయమై దాదాపు పదేళ్ల క్రితం దాఖలైన వ్యాజ్యాన్ని ముగిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం పేర్కొంది. ఎన్‌ఆర్‌ఐలు, వలస కార్మికులకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ 2013లో లండన్‌లో నివసిస్తున్న నాగేందర్ చిందం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై అధ్యయనానికి సుప్రీంకోర్టు 12 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 2018లో లోక్‌సభలో బిల్లు కూడా ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. రాజ్యసభలో ప్రవేశపెట్టకపోవడంతో చట్ట రూపం దాల్చలేదు. తరువాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
Updated Date - 2022-11-02T07:05:01+05:30 IST