Best 100 Cities in the World: దుబాయా మాజాకా.. అరుదైన ఘనత!
ABN, First Publish Date - 2022-12-18T12:19:07+05:30
దుబాయ్ నగరం (Dubai City) అరుదైన ఘనత సాధించింది.
వరల్డ్ టాప్-100 నగరాల జాబితాలో దుబాయ్‌కు రెండో స్థానం
దుబాయ్: దుబాయ్ నగరం (Dubai City) అరుదైన ఘనత సాధించింది. బ్రిటన్‌కు (Britain) చెందిన మార్కెట్ రిసెర్చ్ సంస్థ యూరోమానిటర్ (Euromonitor) విడుదల చేసిన 2022 వరల్డ్‌లోని అత్యుత్తమ వంద నగరాల్లో (Best 100 Cities in the world 2022) మొదటి 10 నగరాల్లో దుబాయ్‌కు (Dubai) రెండో స్థానం దక్కింది. ప్రతి ఏడాది పర్యాటక విధానాలు, సుస్థిరత, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక పనితీరు ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద నగరాల జాబితాను యూరోమానిటర్ విడుదల చేస్తుంది. ఇక తాజాగా విడుదల చేసిన ఈ లిస్ట్‌లో పారిస్ నగరం (Paris City) వరుసగా రెండో ఏడాది కూడా తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.
'టాప్-100 సిటీస్ ఇండెక్స్ 2022'లోని టాప్-10లో పారిస్ తర్వాత దుబాయ్, ఆమ్‌స్టర్‌డామ్, మాడ్రిడ్, రోమ్, లండన్, మ్యూనిచ్, బెర్లిన్, బార్సిలోనా నగరాలు ఉన్నాయి. ఇక దుబాయ్ గతేడాదితో పోల్చితే సుమారు రెట్టింపు మంది పర్యాటకులను ఆహ్వానించింది. ఈ ఏడాది దాదాపు 12మిలియన్లకు పైగా మంది అంతర్జాతీయ పర్యాటకులు దుబాయ్‌లో సందర్శించడం జరిగింది. ఈ కారణంతోనే దుబాయ్ నగరం ఈసారి ఏకంగా రెండో ర్యాంక్‌లో నిలిచింది.
Updated Date - 2022-12-18T12:19:15+05:30 IST