ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi: విజిట్ వీసాల రెన్యువల్‌పై కీలక ప్రకటన.. విజిటర్లకు ఇకపై తప్పనిసరిగా..

ABN, First Publish Date - 2022-11-12T12:50:18+05:30

విజిట్ వీసాల పునరుద్ధరణ విషయమై సౌదీ అరేబియా (Saudi Arabia) తాజాగా కీలక ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: విజిట్ వీసాల పునరుద్ధరణ విషయమై సౌదీ అరేబియా (Saudi Arabia) తాజాగా కీలక ప్రకటన చేసింది. విజిట్ వీసాల (Visit Visa) రెన్యువల్‌కు కొత్త ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని సౌదీ అరేబియా హెల్త్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (Saudi Arabia Health Insurance Council) స్పష్టం చేసింది. విజిట్ వీసా పొడిగించిన కాలానికి కొత్త ఆరోగ్య బీమా కవరేజీని (Health insurance coverage) పొందడం తప్పనిసరి అని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (Jawazat) ట్వీట్ చేసింది. తవునియా, బుపా, మెడ్‌గల్ఫ్, గల్ఫ్ యూనియన్, అరేబియా షీల్డ్ కోఆపరేటివ్ ఇన్సూరెన్స్, అరేబియా కోఆపరేటివ్ ఇన్సూరెన్స్, అల్-ఎతిహాద్ కోఆపరేటివ్, అల్-సాగ్ర కోఆపరేటివ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఏఎక్స్ఏ కోపఆరేటివ్, అలైడ్ కోఆపరేటివ్ ఇన్సూరెన్స్ వంటి లైసెన్స్ పొందిన బీమా కంపెనీల నుంచి మాత్రమే బీమా కవరేజిని పొందాలని సూచించింది.

ఇక సింగిల్ ఎంట్రీ విజిట్ వీసాల గడువును 3నెలలకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆ దేశ మంత్రిమండలి మంగళవారం (నవంబర్ 8న) ఆమోదం తెలిపింది. వీసా నిబంధనల్లో చేసిన సవరణల కారణంగా సింగిల్ ఎంట్రీ ఫ్యామిలీ విజిట్ వీసాలు నెల రోజులు చెల్లుబాటు అయితే, మల్టీపుల్ ఎంట్రీ వీసాలు 90 రోజులు చెల్లుబాటు అవుతాయని జవాజత్ (Jawazat) చెప్పుకొచ్చింది. ఇక విజిట్ వీసాల సింగిల్ ఎంట్రీ వాలిడిటీని పెంచుతూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం అన్ని రకాల ప్రయోజనాలకు వర్తిస్తుంది.

Updated Date - 2022-11-12T12:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising