ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Single Name on Passport: పాస్‌పోర్టులో పూర్తి పేరు లేదని కంగారు పడుతున్నారా? మీకో గుడ్ న్యూస్!

ABN, First Publish Date - 2022-11-25T08:13:52+05:30

పాస్‌పోర్టులో సింగిల్ పేరు (Single Name) ఉన్న భారతీయ ప్రయాణికులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (United Arab Emirates) ఎంట్రీ ఉండదని ఇటీవల ఓ కొత్త రూల్‌ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: పాస్‌పోర్టులో సింగిల్ పేరు (Single Name) ఉన్న భారతీయ ప్రయాణికులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (United Arab Emirates) ఎంట్రీ ఉండదని ఇటీవల ఓ కొత్త రూల్‌ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ మార్గదర్శకాలపై తాజాగా దుబాయ్‌లోని భారత కాన్సులేట్ (Indian consulate in Dubai) కీలక ప్రకటన చేసింది. ఈ మార్గదర్శకాలలో మార్పులు చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అధికారిక ఖాతా ద్వారా కొత్త మార్గదర్శకాలను షేర్ చేసింది. విజిట్ వీసాలు ఉన్న ప్రయాణీకులకు/వీసా ఆన్ అరైవల్/ఎంప్లాయిమెంట్, తాత్కాలిక వీసాలు ఉన్నవారికి మాత్రమే ఈ కొత్త మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం యూఏఈలో నివాసం ఉంటున్న వారికి ఇవి వర్తించవని తెలిపింది. ఈ నేపథ్యంలో మార్పులు చేసిన ట్రావెల్ నిబంధనలకు సంబంధించి ట్రావెల్ ఏజెంట్లకు ఎయిరిండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ జారీ చేసిన సర్క్యూలర్‌ను ఇండియన్ కాన్సులేట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సవరించిన మార్గదర్శకాలు...

* ఒకటి కంటే ఎక్కువ పేర్లతో వీసా జారీ చేయబడి, రెండవ పేజీలో ప్రయాణీకుడు తండ్రి లేదా ఇంటి పేరును పేర్కొన్నట్లయితే వారు తమ ప్రయాణాన్ని కొనసాగించడానికి అనుమతించబడతారు.

* వీసా ఆన్ అరైవల్‌కు అర్హత ఉన్న ప్రయాణీకుల కోసం ప్రయాణికుడు తప్పనిసరిగా రెండవ పేజీలో పేర్కొన్న తండ్రి లేదా ఇంటి పేరును కలిగి ఉండాలి.

ఇక ఈ కొత్త నిర్ణయం చాలా మంది ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తుందని అనుకుంటున్నట్లు దీరా ట్రావెల్స్ ప్రతినిధి ఫర్దాన్ హనీఫ్ తెలిపారు. ఎయిరిండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి అప్డేట్ చేసిన నియమాలు, మార్గదర్శకాలకు సంబంధించిన సర్క్యూలర్స్‌ను అందుకున్నట్లు వెల్లడించారు.

అసలు పాత సర్క్యూలర్‌లో ఏముందంటే..?

పాస్‌పోర్టులలో ఒకే పేర్లకు సంబంధించిన సమస్యపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సోమవారం ఓ సర్క్యూలర్ జారీ చేసింది. దీని ప్రకారం.. విమాన ప్రయాణికులు తమ పాస్‌పోర్టులలో (Passports) వారి ప్రాథమిక (మొదటి పేరు), ద్వితీయ (ఇంటిపేరు) పేర్లు తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. అంటే పాస్‌పోర్టులో ప్రయాణికుడి పూర్తి పేరు ఉండాలి. కేవలం పేరు మాత్రమే ఉండి ఇంటి పేరు లేకపోతే ఆ పాస్‌పోర్టు హోల్డర్‌ను యూఏఈ ఇమ్మిగ్రేషన్ విభాగం అంగీకరించదు. అలాంటి ప్రయాణికులను ఐఎన్ఏడీగా(ప్రయాణానికి అనుమతి లేదు- Inadmissible passenger) పరిగణిస్తుందని ఎయిర్ ఇండియా తన సర్క్యూలర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-25T08:52:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising