ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Big Ticket: జాక్‌పాట్ అంటే ఇది.. దుబాయ్ హోటల్‌లో పనిచేసే భారత వ్యక్తి ఎంత గెలుకున్నాడంటే..!

ABN, First Publish Date - 2022-11-05T08:57:42+05:30

గురువారం నిర్వహించిన బిగ్ టికెట్ (Big Ticket) రాఫెల్ డ్రాలో దుబాయ్ హోటల్‌లో పనిచేసే ఓ భారత ప్రవాసుడి (Indian Expat) పంటపడింది. ఇటీవల అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ (Jackpot) తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: గురువారం నిర్వహించిన బిగ్ టికెట్ (Big Ticket) రాఫెల్ డ్రాలో దుబాయ్ హోటల్‌లో పనిచేసే ఓ భారత ప్రవాసుడి (Indian Expat) పంటపడింది. ఇటీవల అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ (Jackpot) తగిలింది. దాంతో ఏకంగా 25 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో అక్షరాల రూ. 55కోట్ల 77లక్షలు. దుబాయ్‌లో నివాసముండే ఎన్ఎస్ సాజేష్‌కు ఈ జాక్‌పాట్ తగిలింది. ఇటీవల సాజేష్ కొనుగోలు చేసిన సిరీస్ నం. 245కు ఈ గ్రాండ్ ప్రైజ్ దక్కింది. గత నాలుగేళ్ల నుంచి ప్రతి నెల సాజేష్ ఇలా బిగ్ టికెట్‌లో పాల్గొంటున్నాడు.

దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఉద్యోగిగా (Hotel Employee) చేస్తున్న సాజేష్ ఈసారి 20 మంది తోటి ఉద్యోగులతో కలిసి ఈ లాటరీ టికెట్ (Lottery Ticket) కొన్నాడు. ఆ టికెటే వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దాంతో ఏకంగా రూ. 55.77కోట్లు గెలుచుకున్నారు. ఇంత భారీ ప్రైజ్‌మనీ గెలుచుకోవడం ఆనందంగా ఉందని, ఈ నగదును తాము 21 మంది సమానంగా పంచుకుంటామని సాజేష్ తెలిపాడు. అలాగే తాను పనిచేసే హోటల్‌లో సుమారు 150 మంది వరకు ఉద్యోగులు ఉన్నారని, వారిలో అవసరం ఉన్నవారికి తన వాటా నుంచి ఎంతో కొంత సాయం చేస్తానని సాజేష్ చెప్పుకొచ్చాడు. ఇకపై కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల బిగ్ టికెట్ లాటరీలో పాల్గొంటానని అన్నాడు.

Updated Date - 2022-11-05T09:06:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising