ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ఐఫోన్లు గిఫ్ట్‌గా అడిగిన అత్తమామలు.. తన పరిస్థితి ఎవరికి రావొద్దంటున్న ఫారిన్ కోడలు.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు

ABN, First Publish Date - 2022-12-08T11:52:08+05:30

మనోళ్లు ఎవరైనా విదేశాల్లో ఉంటున్నారంటే చాలు.. వాళ్లు బాగా సంపాదిస్తున్నారు.. వారికి ఏ సమస్య ఉంటుంది.. బాగా రిచ్ అని ఫిక్స్ అయిపోతాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: మనోళ్లు ఎవరైనా విదేశాల్లో ఉంటున్నారంటే చాలు.. వాళ్లు బాగా సంపాదిస్తున్నారు.. వారికి ఏ సమస్య ఉంటుంది.. బాగా రిచ్ అని ఫిక్స్ అయిపోతాం. అసలు అక్కడ వారి ఆర్థిక పరిస్థితి ఏంటో అని కూడా ఆలోచించకుండా ఖరీదైన గిఫ్ట్స్ తెమ్మని డిమాండ్ చేసేస్తుంటాం. ఈ విషయంలో అవతలి వ్యక్తికి అసలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వం. అవతలి వారు మనతో ప్రస్తుతం నా పరిస్థితి ఇక్కడ ఇది అని నిజం చెప్పిన నమ్మం. మనం గిఫ్ట్ అడిగేసరికి ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారని అనుకుంటాం. ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి భారతీయుడిని పెళ్లి చేసుకున్న ఓ కెనడా మహిళకు ఎదురైంది. భారత్‌లో ఉండే తన అత్తమామలు తమకోసం రెండు ఐఫోన్లు కొనుగోలు చేసి పంపించాల్సిందిగా చెబుతున్నారట. లేదు ప్రస్తుతం నా పరిస్థితి ఇది అని నిజం చెప్పిన వారు నమ్మడం లేదట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దాంతో ఆమె పరిస్థితి తలచుకుని నెటిజన్లు అయ్యో పాపం అంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కెనడాలో ఉండే ఓ మహిళ భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె గర్భిణీ. ఈ క్రమంలో ఇండియాలో ఉండే ఆమె అత్తమామలు రెండు ఐఫోన్స్ గిఫ్ట్‌గా అడిగారు. అది విన్న ఆమెకు మొదట నోటమాట రాలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆమె ఆర్థిక పరిస్థితి అంతంతా మాత్రంగానే ఉంది. పైగా ఇంకా కొన్నిరోజుల్లో డెలివరీ కూడా ఉంది. ఇదే విషయం ఆమె తన అత్తమామలతో చెప్పింది. తనకు అంత స్తోమత లేదని, గర్భవతైన తనకే ఆర్థికసాయం అవసరమని వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. కానీ, వారు వినడం లేదట. పైగా తన భర్త కూడా వారికి వత్తాసు పలకడం చూసి షాక్ అయ్యాయనని తన బాధను సోషల్ మీడియాలో చెప్పుకుని వాపోయింది. ఆమె షేర్ చేసిన ఈ పోస్టు కాస్తా నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు అయ్యో పాపం అని అనుకుంటున్నారు.

Updated Date - 2022-12-08T12:20:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising