ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Apple: భారతీయుడు చేసిన పనికి దిగ్గజ సంస్థ షాక్!

ABN, First Publish Date - 2022-11-02T15:20:40+05:30

యాపిల్.. దిగ్గజ టెక్ సంస్థ. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఈ దిగ్గజ సంస్థకు ఓ భారతీయుడు భారీ కన్నం వేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: యాపిల్.. దిగ్గజ టెక్ సంస్థ. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఈ దిగ్గజ సంస్థకు ఓ భారతీయుడు భారీ కన్నం వేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్లలో కొల్లగొట్టాడు. కాగా.. చేసిన తప్పు ఎప్పుడైనా బయటపడుతుంది కదా. ఈ క్రమంలోనే అతడు చేసిన తప్పు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా తయారైంది? ప్రముఖ టెక్ సంస్థనే మోసం చేసిన ఆ భారతీయుడు ఎవరు? అనే విషయాలు తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.

కాలిఫోర్నియా(California)లో ఉన్న యాపిల్ సంస్థలో ధీరేంద్ర ప్రసాద్ అనే భారతీయుడు(former Apple employee) 2008లో ఉద్యోగం పొందాడు. విధుల్లో చేరిన తర్వాత మూడేళ్లపాటు బాగానే పని చేశాడు. ఆ తర్వాత అతడి బుద్ధి పెడదారి పట్టింది. అక్రమంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే దొంగ ఇన్ వాయిస్‌లు సృష్టించడం, పరికరాలను దొంగిలించడం, సంస్థ ఛార్జ్ చేయని సర్వీసులకు కూడా డబ్బులు వసూలు చేయడం(defraud Apple) ప్రారంభించాడు. ఇలా 2011-2018 మధ్య ఏకంగా 17మిలియన్ డాలర్లు(భారతీయ కరెన్సీలో రూ.140.66కోట్లు) దోచుకుని తర్వాత ఉద్యోగం మానేశాడు.

కాగా.. అతడు చేసిన మోసాలు తాజాగా వెలుగులోకి వచాయి. దీంతో ప్రస్తుతం ధీరేంద్ర ప్రసాద్ కోర్టు విచారణను ఎదుర్కొంటున్నాడు. ఈ సందర్భంగా అతడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. రాబర్ట్ గ్యారీ హాన్సెన్, డాన్ ఎమ్ బేకర్ అనే ఇద్దరి సహాయంతో ఈ పని చేసినట్టు వెల్లడించాడు. ఈ క్రమంలో కోర్టు తదుపరి విచారణను 2023 మార్చి 14కు వాయిదా వేసింది. ప్రస్తుతం ధీరేంద్ర ప్రసాద్ పోలీసు కస్టడీలో ఉన్నాడు.

Updated Date - 2022-11-02T16:08:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising