ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: షాకింగ్ గణాంకాలు.. 10 నెలల్లో 47వేల మందిపై ట్రావెల్ బ్యాన్..!

ABN, First Publish Date - 2022-12-18T09:21:00+05:30

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసులతో పాటు దేశ పౌరుల పట్ల కూడా కఠినంగా ఉంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసులతో పాటు దేశ పౌరుల పట్ల కూడా కఠినంగా ఉంటోంది. ఏ చిన్న నేరం చేసినా.. కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక ప్రవాసులకైతే పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. వీసాలు, వర్క్ పర్మిట్లకు ఎక్కడలేని షరతులు విధిస్తోంది. ఇక ఉల్లంఘనలకు పాల్పడితే అంతే సంగతులు. వలసదారులు నేరం చేసినట్లు రుజువైతే చాలు దేశం నుంచి బహిష్కరించడం చేస్తోంది. ఈ క్రమంలో ఆ దేశ న్యాయశాఖ (Justice Ministry) ట్రావెలింగ్ బ్యాన్‌కు సంబంధించి తాజాగా విడుదల చేసిన గణాంకాలు షాక్‌కు గురి చేస్తున్నాయి. ఈ ఏడాది 10 నెలల్లో కువైత్ ఏకంగా 47వేల మందిపై ట్రావెల్ బ్యాన్ (Travel Ban) విధించిందట.

న్యాయశాఖ రిపోర్ట్ ప్రకారం 2022 జనవరి నుంచి అక్టోబర్ చివరి వరకు 47,512 మంది ట్రావెల్ బ్యాన్‌కు గురయ్యారు. గతేడాదితో పోలిస్తే ఇది 17 శాతం అధికం. 2021లో 30,689 మందిని తమ దేశానికి ట్రావెల్ చేయకుండా నిషేధించింది. ఈ ఏడాది అత్యధికంగా ఫర్వానియా గవర్నరేట్ పరిధిలో 19,114 ట్రావెల్ బ్యాన్లు నమోదయ్యాయి. ఆ తర్వాత వరుసగా అహ్మదీ (13,527), హవాల్లీ(13,430), రాజధాని కువైత్ సిటీ (12,407), జహ్రా (11,601), ముబారక్ అల్-కబీర్ (4,310) ఉన్నాయి.

Updated Date - 2022-12-18T09:28:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising