ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ కీలక నిర్ణయం.. డ్రైవింగ్ లైసెన్సులను కోల్పోతున్న ప్రవాసులు!
ABN, First Publish Date - 2022-10-31T10:31:36+05:30
కువైత్‌లో పెద్ద మొత్తంలో ప్రవాసులు తమ డ్రైవింగ్ లైసెన్సులను కోల్పోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 10వేల మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సులు రద్దయ్యాయి. ఇంకా భారీ మొత్తంలో..
ఎన్నారై డెస్క్: కువైత్‌లో పెద్ద మొత్తంలో ప్రవాసులు తమ డ్రైవింగ్ లైసెన్సులను కోల్పోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 10వేల మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సులు రద్దయ్యాయి. ఇంకా భారీ మొత్తంలో ప్రవాసులు తమ డ్రైవింగ్ లైసెన్సులను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
కువైత్‌లోని ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాసులు డ్రైవింగ్ లైసెన్సులను పొందడానికి అవసరమైన నిబంధనలను డిపార్ట్‌మెంట్ సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను విరుద్ధంగా లైసెన్సులు కలిగిన ప్రవాసులను గుర్తించి, సమన్లు జారీ చేస్తోంది. దీంతో ప్రవాసులు లైసెన్సులను కోల్పోతు్నారు. ఈ ఏడాది చివరి వరకు ఈ సమీక్ష జరగనున్నట్టు తెలుస్తోంది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోయే ప్రవాసుల సంఖ్య మరింత పెరగనుంది. ఇదిలా ఉంటే.. లైసెన్సులు రద్దు చేసిన తర్వాత కూడా వాహనాలు నడుపుతూ పట్టుబడితే.. తీవ్రమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది.
Updated Date - 2022-10-31T10:31:38+05:30 IST