TDP: ఎన్నారై టీడీపీ కొత్త కమిటీల నియామకం
ABN, First Publish Date - 2022-10-27T20:38:30+05:30
దక్షిణాఫ్రికా, కెనడాలోని వివిధ టీడీపీ శాఖలకు కార్యనిర్వహక కమిటీ సభ్యులుగా పలువురు నియమితులయ్యారు.
దక్షిణాఫ్రికా, కెనడాలోని వివిధ టీడీపీ శాఖలకు(NRI TDP) కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా పలువురు నియమితులయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వివిధ ఎన్నారైలను కమిటీ సభ్యులుగా నియమిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. కెనడాలోని ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ ఎన్నారై శాఖలతో పాటూ దక్షిణాఫ్రికా ఎన్నారై ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా పలువురు నియమితులయ్యారు.
Updated Date - 2022-10-27T20:52:26+05:30 IST