ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE: విజిట్ వీసాదారులకు యూఏఈ షాక్.. ఇకపై అది కుదరదట..!

ABN, First Publish Date - 2022-12-15T09:51:58+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) విజిట్ వీసాదారులకు (Visit Visa Holders) షాక్ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) విజిట్ వీసాదారులకు (Visit Visa Holders) షాక్ ఇచ్చింది. ఇకపై విజిట్ వీసా (Visit Visa) పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. వీసా గడువు ముగిసిన సందర్శకులు (Visitors) వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లాల్సిందేనని పేర్కొంది. ఈ నిర్ణయం మంగళవారం (డిసెంబర్ 13) నుంచి అమలులోకి వస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా, కరోనాకు ముందు కూడా యూఏఈ సందర్శనకు వచ్చిన విజిటర్లకు ఈ అవకాశం లేదు. అయితే, మహమ్మారి సమయంలో దేశ సందర్శనకు వచ్చి అక్కడే చిక్కుకుపోయిన వారి కోసం దేశంలోనే ఉండి వీసాను పొడిగించుకునే వీలు కల్పించింది అక్కడి ప్రభుత్వం. కోవిడ్ సమయంలో ప్రయాణ ఆంక్షలు (Travel Restrictions) ఉన్న నేపథ్యంలో మానవత దృక్పథంతో యూఏఈ సర్కార్ ఇలా వీసా పొడిగింపుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వీసా పొడిగింపును తొలగించినట్లు స్మార్ట్ ట్రావెల్ ఏజెంట్ ఆఫీ అహ్మద్ తెలిపారు.

ఇక విజిట్ వీసాపై దేశానికి వచ్చి ఉపాధి పొందుతున్న వారు (చివరకు రెసిడెన్సీ వీసా పొందిన వారు సైతం) కూడా తప్పనిసరిగా దేశం నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఆ తర్వాత తిరిగి దేశంలోకి ప్రవేశించడం స్టేటస్ మారుతుందని, అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ఇప్పటికే దేశంలో లాంగ్‌టర్మ్ రెసిడెన్సీ కోసం పలు వీసాలు ఉన్న నేపథ్యంలో విజిట్ వీసా గడువు పొడిగింపును ప్రభుత్వం తొలిగించినట్లు అఫ్తాబ్ టూర్స్ యజమాని అబ్దుల్ రహీం చెప్పారు.

Updated Date - 2022-12-15T09:53:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising