NRI: అల్లుడే కదా అని నమ్మితే.. ఎంత పనిచేశాడో..!
ABN, First Publish Date - 2022-11-26T07:08:22+05:30
నమ్మి కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే మామకే శఠగోపం పెట్టాడు ఓ అల్లుడు.
రకరకాల కారణాలతో రూ.107 కోట్లు వసూలు
కొచ్చి, నవంబరు 25: నమ్మి కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే మామకే శఠగోపం పెట్టాడు ఓ అల్లుడు. మాయమాటలతో మామ దగ్గరి నుంచి ఏకంగా రూ.107 కోట్లు కాజేశాడు. దుబాయికి చెందిన ఎన్నారై వ్యాపారవేత్త అబ్దుల్ లహీర్ హాసన్ తన కూతురికి కేరళకు చెందిన మహమ్మద్ హఫీజ్‌తో 2017లో వివాహం జరిపించారు. హాసన్ తన వ్యాపారంతోపాటు కొన్ని ఆస్తులపై హఫీజ్‌కు యాజమాన్య హక్కులను కల్పించారు. ఈ క్రమంలో తనపై ఈడీ దాడులు జరిగాయని, జరిమానా చెల్లించాలని హాసన్ నుంచి రూ.4 కోట్లను హఫీజ్ తీసుకున్నాడు. ఇలా అతని మోసాలు మొదలయ్యాయి. దాని తర్వాత భూమి కొనుగోలు చేయాలని, పాదరక్షల దుకాణం తెరవాలని ఇలా పలు రకాల సాకులు చెప్పి హాసన్ నుంచి మహమ్మద్ హఫీజ్ రూ.92 కోట్లకు పైగా రాబట్టాడు. అల్లుడి మోసం గురించి ఆలస్యంగా తెలుసుకున్న హాసన్ కేరళలోని అలువా పోలీసులను ఆశ్రయించారు. తన కూతురికి బహుమానంగా ఇచ్చిన ఎనిమిది కేజీల బంగారంతో పాటు రూ.107 కోట్ల ఆస్తిని హఫీజ్ కాజేశాడని హాసన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Updated Date - 2022-11-26T10:17:58+05:30 IST