ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: బోస్టన్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం

ABN, First Publish Date - 2022-11-04T12:42:23+05:30

అగ్రరాజ్యం అమెరికాలోని మసాచు రాష్ట్రం బూస్టన్ మహానగరంలో ఎన్నారై టీడీపీ (NRI TDP) ఆధ్వర్యంలో 'మీట్ అండ్ గ్రీట్' (Meet and Greet) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోస్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలోని మసాచు రాష్ట్రం బూస్టన్ మహానగరంలో ఎన్నారై టీడీపీ (NRI TDP) ఆధ్వర్యంలో 'మీట్ అండ్ గ్రీట్' (Meet and Greet) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోస్టన్ (Boston) నగరంలో ఈ ఏడాది మే నెలలో జరిగిన మహానాడు కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించినందుకు ఎన్నారై టీడీపీ నాయకులందరినీ అభినందించారు. అలాగే ఇదే స్ఫూర్తితో అమెరికాలోని పలు నగరాలలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎన్నారై టీడీపీ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వారు కూడా ఘనంగా జరుపుకోవాలన్నారు. ఎందుకంటే కొన్ని దశాబ్దాల పాటు సినీ రంగంలో నెంబర్. 01గా రాణించడమే గాక, తెలుగుదేశం పార్టీని స్థాపించినా 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినా ఘనత అన్నగారిదని కొనియాడారు. ఆయన హయాంలో పేదవానికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో సుపరిపాలన అందించి తెలుగువాడి ఖ్యాతిని దేశ నలుమూలల చాటి చెప్పిన మహానీయుడని ప్రశంసించారు. మన ఆత్మ గౌరవాన్ని నిలిపిన ఘనుడు ఎన్టీఆర్ అని చెప్పిన రాజేంద్రప్రసాద్.. అలాంటి మహానుభావుని శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో అమెరికాలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఎన్నారై టీడీపీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో బోస్టన్ నగరం ఎన్నారై టీడీపీ లీడర్లతో పాటు తానా మాజీ అధ్యక్షులు నన్నపనేని మోహన్, శ్రీనివాస్ గొంది, అంకినీడు ప్రసాద్ రావి, శ్రీ బోల్ల, సూర్య తేలప్రోలు, అనిల్ పొట్లూరి, చంద్ర వల్లూరు పల్లి, సురేష్ దగ్గుబాటి, కోటేశ్వరరావు కందుకూరి, సురేష్ కమ్మ, రావి వేదల, గోపి నెక్కలపూడి, శరత్ బేతపూడి, బద్రి గుడివాడ, శ్రీకాంత్ చేబ్రోలు, రాజేష్ కాపు, హేమాద్రి లెక్కల, రావుల శ్రీనాథ్, సుధాకర్ దుర్గా, పద్మ కందుకూరి, శిరీష గొంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-04T13:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising