ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: బహ్రెయిన్‌లో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

ABN, First Publish Date - 2022-11-05T13:19:41+05:30

బహ్రెయిన్‌లో శుక్రవారం జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ కార్యక్రమానికి టీడీ జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ అధ్యక్షత వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం ప్రభంజనం ఖాయం

టీడీపీ గెలుపుతోనే అందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

తెలుగుజాతి గుండెల్లో చెరగని సంతకం అన్న ఎన్టీఆర్: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జనార్దన్

బహ్రెయిన్: బహ్రెయిన్‌లో శుక్రవారం జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ కార్యక్రమానికి టీడీ జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాక్షసపాలనను అంతమొందించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశంపార్టీ ఘనవిజయం సాధించి చంద్రబాబు నాయుడు అధికారపగ్గాలు చేపడతారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టిడి జనార్దన్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ సాధించే విజయం తెలుగుదేశం చరిత్రలో మైలురాయిగా నిలవబోతోందని జోస్యం చెప్పారు. బహ్రెయిన్ టీడీపీ అధ్యక్షుడు రఘునాథబాబు నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రవాసాంధ్రులు తరలివచ్చారు.

ఈ సందర్భంగా టీడీ జనార్దన్ మాట్లాడుతూ... 1982లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారం చేపట్టి చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగుదేశం ప్రస్థానం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని అన్నారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న లక్ష్యంతో 2కిలోల బియ్యం నుంచి పక్కా గృహాల నిర్మాణం, పెన్షన్లు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వంటి విప్లవాత్మకమైన పథకాలు ప్రవేశపెట్టిన ఘనత అన్న ఎన్టీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ప్రజలకు పాలనను చేరువచేసేందుకు అప్పటివరకు ఉన్న తహసీల్దార్ వ్యవస్థను రద్దు చేసి, మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రపంచ చరిత్రలో క్రీస్తుపూర్వం, క్రీస్తు శకం మాదిరిగా ఏపీ చరిత్రను టీడీపీకి ముందు, టీడీపీ ఆవిర్భావం తర్వాత అని చెప్పకునే విధంగా ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందించారని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో జొన్న అంబలితో బతుకుబండి లాగిస్తున్న ఓ నిరుపేద కుటుంబాన్ని చూసి చలించిన ఎన్టీఆర్ కిలో రెండు రూపాయల బియ్యం పథకం ప్రవేశపెట్టారని చెప్పుకొచ్చారు. నేడు ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలు ఆరోగ్య భద్రత గురించి మాట్లాడున్నాయి. ఇందిరాగాందీ పేదవాళ్లకు పూరి గుడిసెలు ఇచ్చి గరిబీ హఠావో నినాదం అందుకుంటే... పక్కా ఇళ్లు ఎందుకు కట్టకూడదని ఆలోచించి, ఆరోజుల్లో 5లక్షల ఇళ్లు కట్టించిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆ పథకాన్నే ఈరోజు పీఎంఏవైగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. రాజకీయాల్లో కేపిటిలజం, కమ్యూనిజం, సోషలిజిం ఉన్నాయి. మీరు ఏ ఇజాన్ని అనుసరిస్తారని అప్పట్లో విలేకరులు ప్రశ్నించగా, తాను హ్యూమనిజాన్ని నమ్ముతానని చెప్పిన మహోన్నతుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

రైతులకు 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్, 5శాతం వడ్డీరాయితీతో రుణాలు, సింగిల్ విండో ద్వారా ఎరువులు, పురుగుమందులు అందజేసి అన్నదాతకు వెన్నుదన్నుగా నిలచారని అన్నారు. దేశంలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన మొదటి నేత ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు రాయలసీమలో గాలేరు నగరి, హంద్రీనీవా, ఉత్తరాంధ్రలో మద్దువలస, నెల్లూరులో కండలేరు, తెలంగాణాలో శ్రీరామ్ సాగర్ వంటివి నిర్మించారు. శ్రీశైలం, కుడి ఎడమ కాల్వలతో లక్షలాది ఎకరాలకు సాగునీరందించారని తెలిపారు. ఆడపడుచులకు ఆస్తిలో సమానహక్కు కల్పించి వారి హృదయాల్లో అన్నగా చిరస్థాయిగా నిలచిపోయారని పేర్కొన్నారు. నవశకానికి నాందిపలికిన దార్శనికుడు చంద్రన్న ఒక దుష్టశక్తి నుంచి పార్టీని కాపాడుకునేందుకు అనివార్య పరిస్థితుల్లో 1995లో ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారని తెలిపారు.

చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూనే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నూతన వరవడి సృష్టించారని జనార్దన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా యువతకు లక్షలాది ఉద్యోగాలు, రాష్ట్రంలో తొలిసారిగా మహిళలకు 18లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. సంపద సృష్టించడం ద్వారా ఏ విధంగా రాష్ట్రాభివృద్ధి చేయవచ్చో చేసి చూపించారని ప్రశంసించారు. 66 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 20 మంది ముఖ్యమంత్రుల హయాంలో 22వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే.. ఒక్క చంద్రబాబు హయాంలోనే 15వేల మెగాలవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించారని కొనియాడారు. ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఒక్క మెగావాట్ కూడా అదనంగా ఉత్పత్తి చేయలేదు. ఎడారి జల్లగా పేరొందిన అనంతపురంలో కియా పరిశ్రమను ఏర్పాటు చేసి వేలాది ఉద్యోగావకాశాలు కల్పించారు. దీంతో పాటు రాయలసీమ జిల్లాల్లో డిక్సన్, ఫాక్స్ కాన్, సెల్ కాన్, అపోలో టైర్స్, క్యాడ్ బరీస్ వంటి పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించి వలసలను నివారించారు.

అమరావతిలో అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మించేందుకు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానంలో ప్రభుత్వంపై పైసా భారం పడకుండా 33వేల ఎకరాల భూమి సేకరించారు. ఇది ప్రపంచ చరిత్రలోనే రికార్డు. వనరుల వృద్ధి, ఉద్యోగాలు, సంపద సృష్టి కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారని అన్నారు. ఎంప్లాయిమెంట్, వెల్డ్ క్రియేషన్ అనేవి చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమైందన్నారు. 40 నెలల జగన్ హయాంలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి అభివృద్ధిపథంలో నడిపించడం ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకరావడం చారిత్రక అవసరమని ఈ సందర్భంగా జనార్దన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, బహ్రెయిన్ టీడీపీ అధ్యక్షుడు రఘునాథబాబు, టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ కన్వీనర్ హరిబాబు, బహ్రెయిన్ టీడీపీ ఉపాధ్యక్షుడు శివకుమార్, ప్రధాన కార్యదర్శి ఏవీ రావు, ట్రెజరర్ బొల్లా సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-05T13:19:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising