ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi Arabia: భారత్‌ నుంచి సౌదీ వెళ్లే వారికి శుభవార్త.. తెలుగు ప్రవాసీయులకు భారీ ఉపశమనం

ABN, First Publish Date - 2022-11-18T07:29:20+05:30

ఉపాధి కోసం గల్ఫ్‌ దేశం సౌదీ అరేబియాకు వెళ్లేవారికి శుభవార్త..! ఇకపై భారత్‌ నుంచి సౌదీ వెళ్లే వారికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతీయులకు సౌదీ సర్కారు మినహాయింపు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): ఉపాధి కోసం గల్ఫ్‌ దేశం సౌదీ అరేబియాకు వెళ్లేవారికి శుభవార్త..! ఇకపై భారత్‌ నుంచి సౌదీ వెళ్లే వారికి పోలీసు వెరిఫికేషన్‌ సర్టిఫికెట్‌(పీసీసీ) అక్కర్లేదు. ఈ మేరకు సౌదీ సర్కారు గురువారం ఓ ప్రకటన చేసింది. ‘‘భారత్‌, సౌదీ అరేబియా మధ్య ఉన్న స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశలో పీసీసీ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం’’ అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.

ఆగస్టు ఉత్తర్వులు రద్దు

గల్ఫ్‌ దేశాలన్నింటిలో సౌదీ అరేబియాలో ఉపాధికి ప్రపంచదేశాల పౌరులు వెళ్తుంటారు. బ్లూకాలర్‌ మొదలు.. వివిధ కేటగిరీల విధుల్లో భారతీయుల పెద్ద ఎత్తునే ఉంది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే నిత్యం 800-1000 వీసాలు ఎండార్స్‌ అవుతుంటాయి. ఈ వీసాల ఎండార్స్‌కు ముందు పీసీసీ తప్పని సరి అని పేర్కొంటూ సౌదీ సర్కారు ఆగస్టులో ఉత్తర్వులిచ్చింది. ఈ నిబంధన నుంచి తమను మినహాయించాలంటూ భారత్‌ కోరుతూ వస్తోంది. ఇటీవల సౌదీ పర్యటనకు వచ్చిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఇదే విషయంపై సౌదీ సర్కారుకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

మందగించిన పనులు..!

పీసీసీ నిబంధన తర్వాత భారత్‌ నుంచి.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారి వీసాలపై తీవ్ర ప్రభావం పడింది. రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. పెద్ద ఎత్తున పీసీసీకి దరఖాస్తులు వెల్లువెత్తడంతో.. హైదరాబాద్‌, విశాఖల్లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలపై ఒత్తిడి పెరిగింది. పెండెన్సీ కూడా పేరుకుపోతోంది. దీంతో.. సౌదీలో సకాలంలో ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితులు లేవు. ముఖ్యంగా రియాధ్‌ మెట్రోతోపాటు.. కొన్ని కీలక ప్రాజెక్టుల పనులు నత్తనడకను అందుకున్నాయి. దీంతో.. పీసీసీ నిబంధన నుంచి భారతీయులకు మినహాయింపునిస్తూ సౌదీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2022-11-18T07:40:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising