ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi Arabia: జెడ్డా నగరం అస్తవ్యస్తం.. సరిగ్గా 13ఏళ్ల క్రితం నాటి సేమ్ సీన్ మ‌ళ్లీ రీపిట్!

ABN, First Publish Date - 2022-11-25T12:44:42+05:30

సౌదీ అరేబియాలోని (Saudi Arabia) జెడ్డా నగరాన్ని అకాల వర్షాలు (Rains) వణికిస్తున్నాయి. భారీగా పొటెత్తుతున్న వరదల కారణంగా నగరంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెడ్డా: సౌదీ అరేబియాలోని (Saudi Arabia) జెడ్డా నగరాన్ని అకాల వర్షాలు (Rains) వణికిస్తున్నాయి. భారీగా పొటెత్తుతున్న వరదల కారణంగా నగరంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సరిగ్గా 13ఏళ్ల క్రితం నాటి సేమ్ సీన్ మ‌ళ్లీ రీపిట్ అయింది. 2009 నవంబర్‌లో కూడా ఇలాగే వరదలు జెడ్డాను (Jeddah) అస్తవ్యస్తం చేశాయి. అప్పుడు ఏకంగా 122 మంది చనిపోయారు. తిరిగి ఇప్పుడు మరోసారి అదే నవంబర్‌లో జెడ్డా నగరంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఇప్పటివరకు ఇద్దరు మృతిచెందినట్లు సమాచారం.

జాతీయ వాతావరణం కేంద్రం సమాచారం ప్రకారం.. జెడ్డాలో గురువారం రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఎడతెరిపి లేని భారీ వర్షం పడింది. ఆరు గంటల్లో ఏకంగా 179మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లు, వీధులు జలశయాలను తలపిస్తున్నాయి. భారీగా చేరిన వ్యర్థాలను తొలగించడానికి, రవాణా వ్యవస్థను పునరుద్ధరించడానికి చాలా సమయం పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం వ్యవర్థాల తొలగింపు కోసం 2,564 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు గంటల తరబడి అంతరాయం ఏర్పడింది.

అటు కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రం వద్ద కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. శుక్రవారం కూడా జెడ్డాలో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జెడ్డాలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. మక్కా, థువల్, జెడ్డా, రబీగ్ గవర్నరేట్‌తో పాటు ఇతర తీర ప్రాంతాల్లోని జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Updated Date - 2022-11-25T12:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising