Saudi Arabia: చట్టవిరుద్ధమైన అబార్షన్లు.. ఇద్దరు ప్రవాస మహిళలు అరెస్ట్..!
ABN, First Publish Date - 2022-11-25T10:30:25+05:30
చట్టవిరుద్ధమైన అబార్షన్లు (Illegal abortions) చేస్తున్న ఇద్దరు ప్రవాస మహిళలను (Expat women) రియాద్‌లో సౌదీ అరేబియా పోలీసులు అరెస్ట్ చేశారు.
రియాద్: చట్టవిరుద్ధమైన అబార్షన్లు (Illegal abortions) చేస్తున్న ఇద్దరు ప్రవాస మహిళలను (Expat women) రియాద్‌లో సౌదీ అరేబియా పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రతాధికారుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు రియాద్ ఆరోగ్యశాఖ ప్రకటించింది. దక్షిణ రియాద్‌లోని అద్దె అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు ప్రవాస మహిళలు చట్టవిరుద్ధంగా అబార్షన్లు చేస్తున్నట్లు గుర్తించినట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. కనీస ఆరోగ్య అవసరాలు లేని వాతావరణంలో అబార్షన్లు జరిగాయని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం రియాద్ ఆరోగ్యశాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అసిస్టెన్స్ ఫర్ కంప్లియన్స్ (Department of Assistance for Compliance) అధికారులు, భద్రతాధికారుల సహకారంతో చట్ట విరుద్ధంగా అబార్షన్లు జరుగుతున్న అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి మహిళలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇక గత కొన్నిరోజులుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ అఫైర్స్ డా. హసన్ అల్-షహ్రానీ ఆదేశాలతో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు వ్యతిరేకంగా విస్తృతంగా సోదాలు చేపడుతున్నట్లు రియాద్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, అదుపులోకి తీసుకున్న ఇద్దరు ప్రవాస మహిళల వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు.
Updated Date - 2022-11-25T10:30:27+05:30 IST