Viral Video: కూచిపూడి నృత్యంతో అదరగొట్టిన రిషి సునాక్ కూతురు.. శభాష్ అంటున్న నెటిజన్లు!
ABN, First Publish Date - 2022-11-27T10:40:39+05:30
భారత సంతతికి చెందిన రిషి సునాక్(Rishi Sunak) బ్రిటన్ ప్రధానిగా (UK PM)ఎన్నికై చరిత్ర సృష్టించారు. తద్వారా ఈ పదవిని అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన రికార్డుకెక్కారు.
లండన్: భారత సంతతికి చెందిన రిషి సునాక్(Rishi Sunak) బ్రిటన్ ప్రధానిగా (UK PM)ఎన్నికై చరిత్ర సృష్టించారు. తద్వారా ఈ పదవిని అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన రికార్డుకెక్కారు. లిజ్ ట్రస్ ప్రధానిగా వైదొలగడంతో రిషికి ఈ అవకాశం దక్కింది. ఇక బ్రిటన్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. దాంతో దేశాన్ని గాడిలో పెట్టేందుకు రిషి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదిలాఉంటే.. రిషి సునాక్ యూకే ప్రధాని కాకముందు నుంచే ఆయన ఫ్యామిలీకి ఆ దేశంలో మంచి పాపులారిటీ ఉంది. రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తి బ్రిటన్‌లోని సంపన్నుల్లో ఒకరు. అలాగే తాజాగా 'ఆసియన్ రిచ్ లిస్ట్ 2022'లో తొలిసారిగా చోటు కూడా దక్కించుకున్నారు. 790 మిలియన్ పౌండ్ల సంపదతో అక్షతా మూర్తి ఈ జాబితాలో 17వ స్థానాన్ని సంపాదించారు. ఇక ఆయన కుమార్తెలు కృష్ణ సునాక్, అనౌష్క సునాక్‌లకు కూడా స్టార్ కిడ్స్‌గా బ్రిటన్‌లో పేరుంది.
Updated Date - 2022-11-29T07:09:05+05:30 IST