ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visit Visa: భార్య, పిల్లలను కువైత్ తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్..!

ABN, First Publish Date - 2022-12-16T08:34:14+05:30

కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Interior Ministry) విజిట్ వీసాల (Visit Visas) విషయమై తాజాగా కీలక ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Interior Ministry) విజిట్ వీసాల (Visit Visas) విషయమై తాజాగా కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది జనవరి నుంచి విజిట్ వీసాల జారీని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. అయితే, ఈసారి విజిట్ వీసాలకు చాలా కఠినమైన షరతులు ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా విజిట్ వీసాను వర్క్ పర్మిట్‌గా (Work Permit) ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఎట్టిపరిస్థితుల్లో కుదరదట. అలాగే ఈ వీసాలకు ఫీజు మాత్రం రెట్టింపు చేసే ప్లాన్‌లో మంత్రిత్వశాఖ ఉన్నట్లు సమాచారం. అంతేగాక విజిట్ వీసాల ద్వారా కేవలం ప్రవాసుల భార్య, పిల్లలకు మాత్రమే దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంటుందట. ఇక ఎక్కువ శాలరీలు ఉన్న వలసదారుల పేరెంట్స్‌ను (Parents) కూడా విజిట్ వీసాల ద్వారా కువైత్ (Kuwait) తీసుకువచ్చేందుకు వీలు కల్పించనుందట. కాగా, సందర్శన, కుటుంబ పునఃకలయిక వీసాల మంజూరు కోసం షరతులపై నిర్ణయాన్ని జారీ చేయడంతో పాటు తుది నిర్ణయం తీసుకోవడానికి అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అల్-సబాకు సమర్పించడానికి సాంకేతిక బృందం ప్రస్తుతం తుది మెరుగులు దిద్దే పనిలో ఉంది.

Updated Date - 2022-12-16T08:34:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising