Bonda Uma: ఢిల్లీ లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డిని బలిపశువును చేశారు.. జగన్, విజయసాయిరెడ్డి జైలుకే
ABN, First Publish Date - 2022-11-13T19:06:51+05:30
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheshwararao) విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో దేశ ప్రజల వేళ్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపుతున్నాయని బోండా ఉమా ఆరోపించారు. శరత్ చంద్రారెడ్డిని బినామీగా పెట్టుకుని విజయసాయిరెడ్డి బలిపశువు చేశారని బోండా ఉమా మండిపడ్డారు. జగన్, విజయసాయిరెడ్డితో పాటు వాళ్ల బినామీలు ఇక జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. ఏపీలో అదాన్ డిస్టిలరీస్ పేరుతో కల్తీ లిక్కర్ వ్యాపారం జరుగుతోందని,2019లో కొత్త మద్యం పాలసీ తెచ్చాక రూ.4 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని బోండా ఉమా తెలిపారు. ఈ డబ్బు ఎక్కడికి పోయిందో జగన్, విజయసాయిరెడ్డి చెప్పాలని బోండా ఉమా డిమాండ్ చేశారు.
Updated Date - 2022-11-13T19:26:47+05:30 IST