Nadendla Manohar: ఏపీలోనే అతి పెద్ద స్కామ్ జగనన్న కాలనీలు
ABN, First Publish Date - 2022-11-09T17:46:19+05:30
వైసీపీ (YCP GOVT) ప్రభుత్వంపై జనసేన (Janasena) నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు (Nadendla Manohar) గుప్పించారు. ఏపీలోనే అతి పెద్ద స్కామ్ జగనన్న కాలనీలు అని నాదెండ్ల ఆరోపించారు.
అమరావతి: వైసీపీ (YCP GOVT) ప్రభుత్వంపై జనసేన (Janasena) నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు (Nadendla Manohar) గుప్పించారు. ఏపీలోనే అతి పెద్ద స్కామ్ జగనన్న కాలనీలు అని నాదెండ్ల ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేయడానికే జనసేన సోషల్ ఆడిట్ చేపట్టిందని తెలిపారు. ఈ నెల 12,13,14 తేదీల్లో 'జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీలు' పేరుతో కార్యక్రమం చేపడుతున్నట్లు మనోహర్ చెప్పారు. జగనన్న కాలనీల కోసం 68,677 ఎకరాలను కొనుగోలు చేశారని, రూ.10 నుంచి 20 లక్షలు విలువచేసే ఎకరా భూమిని రూ.70 లక్షల నుంచి రూ.కోటి పెట్టి కొనుగోలు చేశారని నాదెండ్ల ఆరోపించారు. వీటన్నింటినీ సోషల్ ఆడిట్ ద్వారా ప్రజలకు వివరిస్తామని నాదెండ్ల మనోహర్ అన్నారు.
Updated Date - 2022-11-09T17:46:42+05:30 IST