Nadendla Manohar: మంత్రి జోగి రమేష్ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా?
ABN, First Publish Date - 2022-11-18T18:06:23+05:30
పెడనలో జనసైనికులపై (Janasena) వైసీపీ (YCP) కార్యకర్తలు దాడి చేయడం దుర్మార్గమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు.
అమరావతి: పెడనలో జనసైనికులపై (Janasena) వైసీపీ (YCP) కార్యకర్తలు దాడి చేయడం దుర్మార్గమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు. మంత్రి జోగి రమేష్ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా? అని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తారా?, జగనన్న ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం విఫలం, వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
Updated Date - 2022-11-18T18:06:28+05:30 IST