ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Zomato Food Delivery: రూ.362 రీఫండ్ కోసం జొమాటో పై కేసు.. ఈ విద్యార్థికి ఎంత పరిహారం దక్కిందంటే..!

ABN, First Publish Date - 2022-11-17T17:53:12+05:30

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అనేక రకాల కార్యకలాపాలు చాలా సులభతరమయ్యాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ (Smart phone) ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా ఒక్క బటన్ నొక్కగానే అలా మనకు కావాల్సిన సమాచారం క్షణాల్లో అందుతుంది. అలాగే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అనేక రకాల కార్యకలాపాలు చాలా సులభతరమయ్యాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ (Smart phone) ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా ఒక్క బటన్ నొక్కగానే అలా మనకు కావాల్సిన సమాచారం క్షణాల్లో అందుతుంది. అలాగే మనకు ఏది తినాలనిపించినా.. ఎక్కడికో వెళ్లకుండా మన దగ్గరికే వచ్చే వెసులుబాటు వచ్చింది. అందులో ఇందులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అప్పుడప్పుడూ అన్ని నష్టాలూ జరుగుతుంటాయి. ఫుడ్ ఆర్డర్ చేసిన సమయంలో అందుకు బదులుగా వేరే వస్తువులు, రాళ్లు రప్పలు రావడం చాలా సార్లు చూశాం. అలాగే కొన్నిసార్లు పాడయిన, కుళ్లిపోయిన ఆహారం కూడా వస్తుంటుంది. మరికొన్ని సార్లు చివరి నిముషంలో ఆర్డర్లు క్యాన్సిల్ అవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో వినియోగదారుడికి ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. తాజాగా, ఇలాంటి ఓ కేసు వెలుగులోకి వచ్చింది. రూ.362 రీఫండ్ కోసం జొమాటోపై కేసు వేసిన విద్యార్థికి.. మెరుగైన పరిహారం దక్కింది. వివరాల్లోకి వెళితే..

Sim Card New Rule: 15 రోజుల్లోగా అమలు చేయాల్సిందే.. కంపెనీలకు ఆదేశాలు..!

కేరళలోని (Kerala) కొల్లాం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో లా చివరి చదువుతున్న అరుణ్ కృష్ణన్ అనే విద్యార్థి.. కొల్లంలో ఉండగా జొమోటోపై.. కొల్లాం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు (Kollam district consumer forum) ఫిర్యాదు చేశాడు. కృష్ణన్ రూ.362 విలువైన ఫుడ్‌ను ఆర్డర్ (Food order) చేయగా.. దాన్ని డెలివరీ చేయడంలో Zomato విఫలమైంది. పైగా డబ్బులు కూడా రీఫండ్ చేయలేదు. దీంతో చివరకు కోర్టును ఆశ్రయించాడు. రద్దీ సమయాలు, వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేశాడు. అలాగే తనకు నష్ట పరిహారం కింద రూ.1.5లక్షలు, కోర్టు ఖర్చుల కింద రూ.10,000 చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనిపై Zomato కంపెనీ బదులిస్తూ.. వినియోగదారుడి చిరునామా తప్పుగా నమోదు చేయడం వల్ల ఇలా జరిగిందని పేర్కొంది. అలాగే ఫుడ్ డెలివరీ సమయంలో అతడిని సంప్రదించగా... అందుబాటులో లేడని కోర్టుకు తెలిపింది. అయితే ఈ కేసుపై విచారించిన కోర్టు.. చివరకు కృష్ణన్‌కు నష్టపరిహారం (Damage compensation) కింద రూ.8,362 చెల్లించాలని Zomatoను ఆదేశించింది.

వివాహానంతరం భర్తను దూరం పెట్టిన వధువు.. మూడో రోజు హనీమూన్‌లో భార్య ముసుగు తీసి చూడగా..

Updated Date - 2022-11-17T17:53:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising