విమానం నుంచి కిందకు దూకిన సైనికుడు.. సడన్‌గా తెరచుకోని పారాచ్యూట్.. చివరకు ఏం జరిగిందంటే..
ABN, First Publish Date - 2022-11-15T20:09:42+05:30
విమానం నుంచి పారాచ్యూట్ సాయంతో కిందకు దూకే వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. వేల అడుగుల ఎత్తు నుంచి దూకే క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అయితే అప్పుడప్పుడూ కొందరు అదృష్టవశాత్తు.. క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి..
విమానం నుంచి పారాచ్యూట్ సాయంతో కిందకు దూకే వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. వేల అడుగుల ఎత్తు నుంచి దూకే క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అయితే అప్పుడప్పుడూ కొందరు అదృష్టవశాత్తు.. క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి ఆశ్చర్యాన్ని కలిగించే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. విమానం నుంచి కిందకు దూకే క్రమంలో ఓ సైనికుడి పారాచ్యూట్ తెరచుకోదు. ఈ ఘటనలో చివరకు ఏం జరిగిందంటే..
Viral Video: గడ్డ కట్టే చలిలో భూమిలో ఆమ్లెట్, బ్రెడ్ తయారీ.. అదెలాగో మీరే చూడండి..
ఇండోనేషియా (Indonesia) రాజధాని జకార్తాకు (Jakarta) తూర్పున ఉన్న సులైమాన్ ఎయిర్‌బేస్‌లో (Airbase) శిక్షణ కార్యక్రమం జరుగుతుండగా.. ఈ ఘటన చోటు చేసుకంది. వారంతా శిక్షణ తీసుకుంటున్న సైనికులు. శిక్షణలో భాగంగా విమానం నుంచి కిందకు దాకాల్సి వచ్చింది. దీంతో పలువురు సైనికులు నవంబర్ 8న.. సుమారు 1600 అడుగుల ఎత్తులో ఉన్న విమానం ( plane) నుంచి ఒకేసారి దూకేశారు. అయితే వారిలో సల్మాన్ క్రిస్నెస్ అనే యువకుడి పారాచ్యూట్ (Parachute) తెరుచుకోదు. ఎంత ప్రయత్నించినా తెరుచుకోవపోవడంతో చివరకు తన ప్రాణాల మీద ఆశలు వదులుకున్నాడు. అయితే ఆశ్చర్యకరంగా అతడికి ప్రాణగండం తప్పింది.
వంట గదిలో భోజనం చేస్తున్న భర్త.. మంటల్లో చిక్కుకోవడంతో.. అక్కడే ఉన్న భార్య చివరకు షాకింగ్ నిర్ణయం..
అంత ఎత్తునుంచి పడినా.. కేవలం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పారాచ్యూట్ తాళ్లు ఒకదానిలో ఒకటి చిక్కుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇండోనేషియాలో క్విక్ రియాక్షన్ ఫోర్స్‌గా పిలవబడే ఈ సైనికులు.. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటుంటారు. అలాగే ఈ యూనిట్.. విమానం హైజాకింగ్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌లో కూడా పాల్గొంటుంది. కాగా, సైనికుడు కిందపడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Viral videos) తెగ వైరల్ అవుతోంది.
Updated Date - 2022-11-15T20:09:51+05:30 IST