ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ విషయంలో భర్తను కట్టడి చేసేందుకు ప్రియుడితో కలిసి జ్యోతిష్యుడిని సంప్రదించిన భార్య.. ఇంట్లో అల్మారా చెక్ చేసిన భర్తకు..

ABN, First Publish Date - 2022-11-15T15:53:54+05:30

ఆర్థిక సమస్యలు లేని కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు అనుకోని ఇబ్బందులు తలెత్తుతుంటాయి. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు చేసే తప్పుల కారణంగా చివరకు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్థిక సమస్యలు లేని కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు అనుకోని ఇబ్బందులు తలెత్తుతుంటాయి. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు చేసే తప్పుల కారణంగా చివరకు ఇద్దరి జీవితాలూ నాశనం అవుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతుల విషయంలోనూ ఇలాగే జరిగింది. వారికి ఎలాంటి ఆర్థిక సమస్యలూ లేవు. పైగా భర్త కూడా తన భార్యను సంతోషంగా చూసుకునేవాడు. అయినా ఆమె మాత్రం సమస్యలను కొని తెచ్చుకుంది. చివరకు భర్తను అదుపులో పెట్టుకునేందుకు ప్రియుడితో కలిసి జ్యోతిష్యుడి వద్దకు వెళ్లింది. ఈ ఘటనలో చివరకు ఏం జరిగిందంటే..

ప్రియుడితో కలిసి భర్త ప్రాణం తీసింది.. నాలుగు సంవత్సరాల తర్వాత గుట్టు బైటపడింది..

ముంబైలోని పోవై (Mumbai Powai) ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారవేత్త (businessman) తన భార్యతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. ఇతడి భార్యకు 13సంవత్సరాల క్రితం ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. తర్వాత వారి మధ్య వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. అయితే కొన్నాళ్లకు ఈ విషయం భర్తకు తెలియడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. కొన్ని నెలలుగా ఈ గొడవలు (quarrels) మరింత పెరిగిపోయాయి. దీంతో ఎలాగైనా భర్తను తన అదుపులో పెట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడితో చెప్పడంతో.. జ్యోతిష్యుడిని కలిసి బ్లాక్ మ్యాజిక్ (Black magic) చేయిద్దామని సలహా ఇచ్చాడు. తర్వాత ఇద్దరూ కలిసి సోషల్ మీడియా (Social media) ద్వారా ఓ జ్యోతిష్యుడిని సంప్రదించారు.

గొడవ తర్వాత.. భర్త గదిలోని ట్రంకు పెట్టెను తెరిచిన భార్య.. అందులో అతడు దాచిన వస్తువును చూసి.. చివరకు..

అనంతరం ఒప్పందం ప్రకారం.. ఇంట్లోని అల్మారాలో భర్త దాచిపెట్టిన.. రూ.24లక్షల విలువైన బంగారం, రూ.35లక్షల నగదును ప్రియుడికి అందజేసింది. అక్టోబర్ 13, 18మధ్య ఈ వ్యవహారం జరిగింది. తర్వాత దీపావళి సందర్భంగా ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు.. భర్త అల్మారా తెరచి చూశాడు. అయితే అందులో నగలు, నగదు కనిపించలేదు. దీనిపై భార్యను ప్రశ్నించినా.. తనకేమీ తెలీదంటూ బుకాయించింది. ఇటీవల ఆమెను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

సహోద్యోగితో యువకుడి ప్రేమాయణం.. అసలు విషయం తెలుసుకున్న యువతి.. ఓ రోజు మూడో అంతస్తులో..

Updated Date - 2022-11-15T15:57:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising