కూలి పనులకు వెళ్లిన మహిళ.. ధాన్యం తూర్పారపడుతుండగా.. ఫ్యాన్ కారణంగా సడన్‌గా..
ABN, First Publish Date - 2022-11-02T20:24:13+05:30
మృత్యువు ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. అప్పటిదాకా సంతోషంగా ఉన్న ప్రాంతంలో.. ఒక్కోసారి విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తెలంగాణలో (Telangana) తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మహిళ కుటుంబ పోషణ నిమిత్తం రోజూ మాదిరే కూలి పనులకు వెళ్లింది. అయితే ధాన్యం తూర్పారపడుతుండగా..
మృత్యువు ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. అప్పటిదాకా సంతోషంగా ఉన్న ప్రాంతంలో.. ఒక్కోసారి విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తెలంగాణలో (Telangana) తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మహిళ కుటుంబ పోషణ నిమిత్తం రోజూ మాదిరే కూలి పనులకు వెళ్లింది. అయితే ధాన్యం తూర్పారపడుతుండగా.. అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఫ్యాన్ కారణంగా ఇంతటి ఘోరం జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. వివరాల్లోకి వెళితే..
నిర్మానుష్య ప్రదేశంలో.. కూతురు కేకలు విని పరుగెత్తుకుంటూ వెళ్లిన తల్లి.. అక్కడి దృశ్యం చూసి..
ధాన్యం ఆరబెట్టేందుకు ట్రాక్టర్‌కు ఏర్పాటు చేసిన ఫ్యాన్‌కు చీరకొంగు చిక్కుకుని ఓ మహిళా కూలీ మృతి చెందింది. తెలంగాణ యాదాద్రిభువనగిరి జిల్లా (Yadadribhuvanagiri District) భూదాన్‌పోచంపల్లి మండలం ముక్తాపూర్‌లో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ సైదిరెడ్డి, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముక్తాపూర్ గ్రామానికి చెందిన మరాఠి ఆండాలు(55) పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రమావత్ జగన్ అనే రైతుకు చెందిన ధాన్యాన్ని తూర్పారపట్టేందుకు కూలి పనికి వెళ్లింది.
సెల్ఫీ తీసుకుందామని పిలవడంతో.. షాపింగ్ మాల్ వెనుక వైపునకు వెళ్లింది.. కాసేపటి తర్వాత చూస్తే..
అయితే ధాన్యం ఆరబెట్టే క్రమంలో ఆమె చీరకొంగు ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌కు ఏర్పాటు చేసిన ఫ్యాను రెక్కల్లో చిక్కింది. వెంటనే రెక్కల వేగానికి ఆమె కింద పడిపోగా కాలు విరగడంతో పాటు ఛాతి నేలకు బలంగా తాకడంతో స్పృహతప్పి పడిపోయింది. సమీపంలోని రైతులు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందింది. ఆండాలుకు భర్త, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భర్త మరాఠి అంజయ్య ఫిర్యాదుమేరకు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపారు. మహిళ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Updated Date - 2022-11-02T20:24:18+05:30 IST