మీ భర్త వేరే మహిళతో తిరుగుతున్నాడని.. ఫోన్ చేసిన వ్యక్తి.. తీరా అక్కడికి వెళ్లగా.. స్కూటీలో వచ్చిన యువతి సడన్‌గా..
ABN, First Publish Date - 2022-12-06T16:18:35+05:30
వివాహేతర సంబంధాలు (Extramarital affairs) కొనసాగించే కొందరు.. కొన్నిసార్లు దారుణాలకు పాల్పడుతుంటారు. ఇటీవల మహిళలు కూడా దారుణంగా ప్రవర్తించడం..
వివాహేతర సంబంధాలు (Extramarital affairs) కొనసాగించే కొందరు.. కొన్నిసార్లు దారుణాలకు పాల్పడుతుంటారు. ఇటీవల మహిళలు కూడా దారుణంగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే జరిగింది. మీ భర్త వేరే మహిళతో తిరుగుతున్నాడని.. ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో కంగారుపడిన మహిళ (woman).. అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. అయితే కాసేపటికి స్కూటీపై వచ్చిన ఓ యువతి.. దారుణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే..
Viral Video: యువతిని కలిసేందుకు వెనుక నుంచి బాల్కనీ ఎక్కిన యువకులు.. పైకి వెళ్లగానే ఏం జరిగిందంటే..
మహారాష్ట్ర (Maharashtra) నాగ్‌పూర్ పరిధి యశోధర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న రుక్మిణి అనే మహిళకు భర్త, ఏడాదిన్నర పాప ఉన్నారు. ఇలావుండగా, ఇటీవల ఆమె ఇంట్లో వంట చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. మీ భర్త వేరే మహిళతో తిరుగుతున్నాడని, వెంటనే వస్తే చూపిస్తానని చెప్పాడు. దీంతో ఆమె కంగారుగా తన పాపను ఎత్తుకుని అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. ఆమె అక్కడే నిలబడి వేచి చూస్తుండగా.. కాసేపటికి ఓ యువతి బురఖా ధరించి స్కూటీలో వచ్చింది.
మామ అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పడంతో.. నిద్రమాత్రలు ఇచ్చిన తండ్రి.. పొద్దున లేచిన కూతుళ్లు షాక్..
వచ్చీరాగానే తల్లీకూతుళ్లపై యాసిడ్ పోసి (Acid attack), అక్కడి నుంచి పరారైంది. యాసిడ్ మీద పడగానే తీవ్రమైన నొప్పితో మహిళ కేకలు పెట్టింది. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ దాడి ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో (CC cameras) రికార్డు అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన యువతి.. రుక్మిణి భర్త ప్రియురాలి అని విచారణలో తెలిసింది. ప్రియుడి భార్యపై కోపంతోనే ఇలా చేసిందని తెలిసింది. సదరు యువతికి సహకరించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Updated Date - 2022-12-06T16:27:44+05:30 IST