ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య విద్యకు మధ్యలోనే పులుస్టాప్.. UPSC ఫలితాల్లో నాలుగో ర్యాంక్.. ఈమె సక్సెస్ స్టోరీ ఇదీ..!

ABN, First Publish Date - 2022-11-26T16:43:12+05:30

ఐఏఎస్ ఆఫీసర్ కావాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ స్థానంలోకి వెళ్లేది మాత్రం కొందరు మాత్రమే ఉంటారు. ఇంకొందరు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐఏఎస్ ఆఫీసర్ కావాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ స్థానంలోకి వెళ్లేది మాత్రం కొందరు మాత్రమే ఉంటారు. ఇంకొందరు నిద్రాహారాలు మాని చదివినా, కోచింగ్ తీసుకున్నా కూడా.. అనుకున్న లక్షాన్ని చేరుకోలేరు. అయితే మరికొందరు మాత్రం ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే తమ కలలను సాకారం చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఆదర్శవంతమైన వారిలో.. ఆర్టికా శుక్లా ఒకరు. ఎంబీబీఎస్ తర్వాత ఐఏఎస్ అధికారి కావాలని నిర్ణయించుకుంది. అయితే ఇందుకోసం ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే.. UPSC పరీక్షలో ఆల్ ఇండియా నాలుగో ర్యాంక్ సాధించారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆర్టికా శుక్లా.. కుటుంబ నేపథ్యానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Viral Video: అమ్మ బాబోయ్.. పెళ్లి వేడుకలో ఇతడు వేసిన డాన్స్ చూసి బంధువులంతా రచ్చ రచ్చ..!

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) వారణాసికి చెందిన ఆర్టికా శుక్లా (Artika Shukla).. ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అనంతరం ఎండీ విద్యను అభ్యసిస్తుండగా.. ఐఏఎస్ అధికారి కావాలని నిర్ణయించుకుంది. ఆర్టికా తండ్రి బ్రజేష్ శుక్లా కూడా వైద్యుడే. ఈయన ప్రస్తుతం IMA (Indian Medical Association) కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఆర్టికా సోదరుడు ఉత్కర్ష శుక్లా.. ఇండియన్ రైల్వే ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ అధికారిగా ఉన్నారు. ఇతను 2012లో UPSC (Union Public Service Commission) సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆ సమయంలోనే ఆర్టికా శుక్లాకు ఐఏఎస్ అధికారి కావాలని నిర్ణయించుకుంది.

ఏం ఐడియా గురూ.. ఈ వ్యక్తి కారునే దుకాణంగా మార్చడం వెనుక కథేంటో తెలిస్తే..!

అనుకున్నదే తడవుగా ఎండీ విద్యకు స్వస్తి చెప్పి.. తన కలను సాకారం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ఆమె ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. 2014లో ఆమె పరీక్షల సిద్ధమైంది. తన సోదరుడు ఇచ్చిన సలహాలు తీసుకుని, సొంతంగా ప్రిపేర్ అయింది. 2015లో UPSC ఆల్ ఇండియా నాలుగవ ర్యాంక్‌ను సాధించింది. అదే సవంత్సరంలో ఆర్టికా శుక్లాకు IASలో మూడవ ర్యాంక్ సాధించిన జస్మిత్ సింగ్‌ అనే యువకుడు పరిచయం అయ్యాడు. 2017లో ఆర్టికా శుక్లా, జస్మిత్ సింగ్ వివాహం జరిగింది. ఈ వివాహానికి ప్రముఖ ఐఏఎస్ అధికారి టీనా దాబీ కూడా హాజరయ్యారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాకుండా.. చిత్తశుద్ధితో అనుకున్న స్థానానికి చేరుకున్న ఆర్టికా శుక్లా.. ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఒకప్పుడు సింగపూర్‌లో ప్రొఫెషనల్ చెఫ్.. ఇప్పుడు స్వదేశ వీధుల్లో చిన్న ఫుడ్ స్టాల్ ఓనర్.. అయితేనేం..

Updated Date - 2022-11-26T16:43:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising