అల్లుడి నోట అలాంటి మాటలు విని షాక్‌తో చనిపోయిన అత్త.. కేసు పెట్టిన భార్య.. అసలు కథేంటంటే..!
ABN, First Publish Date - 2022-12-28T16:45:03+05:30
కూతురు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేస్తుంటారు తల్లిదండ్రులు. అయితే కొన్నిసార్లు వారి ఆశలు.. అడియాశలు అవుతుంటాయి. వివాహమైన కొత్తలో..
కూతురు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేస్తుంటారు తల్లిదండ్రులు. అయితే కొన్నిసార్లు వారి ఆశలు.. అడియాశలు అవుతుంటాయి. వివాహమైన కొత్తలో బాగున్నా.. తర్వాత కొందరికి భర్త, అత్తమామల నుంచి సమస్యలు ఎదురవుతుంటాయి. అనుమానంతో వేధించేవారు కొందరైతే.. అదనపు కట్నం కోసం వేధించేవారు మరికొందరు ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ విషయంలో ఇలాగే జరిగింది. అల్లుడి నోట అలాంటి మాటలు విని.. అత్త షాక్‌తో చనిపోయింది. దీంతో చివరకు భార్య పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాజధాని లక్నో పరిధి మౌల్విగంజ్ చిక్‌మండి ప్రాంతానికి చెందిన 22ఏళ్ల యువతికి 2021 నవంబర్‌లో సీతాపూర్ పరిధికి చెందిన యూనస్ అనే వ్యక్తితో (marriage) వివాహమైంది. పెళ్లి సమయంలో వరుడు అడిగినంత ఇవ్వలేక.. కొంత మొత్తాన్ని కట్నంగా (dowry) ఇచ్చారు. వివాహం జరిగాక కొన్నాళ్లు బాగానే చూసుకున్నారు. అయితే తర్వాత.. యూనస్ తన భార్యను వేధించడం (Harassment) మొదలెట్టాడు. మరో రూ.2లక్షలు తేవాల్సిందేనని చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ విషయాన్ని అత్తమామలకు చెబితే.. కొడుకును మందలించాల్సింది పోయి, వారు కూడా ఆమెను వేధించడం మొదలెట్టారు. అయినా ఆమె చాలా రోజులు భరిస్తూ వచ్చింది.
మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు నెలలుగా పుట్టింట్లో ఉన్న భార్య.. సడన్‌గా అక్కడికి వెళ్లిన భర్త..
తాము అడిగిన డబ్బులు తేలేదనే ఉద్దేశంతో ఇటీవల మరోసారి ఆమెపై అంతా కలిసి దాడికి దిగారు. అంతటితో ఆగకుండా ఆమెను మే 4న ఇంటి నుంచి గెంటేశారు. పుట్టింటికి వెళ్లిన ఆమె జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. కూతురి జీవితం ఇలా అయిందే అనే ఆందోళనతో ఆమె తల్లి కొన్ని రోజులకు చనిపోయింది. అయినా యూనస్ మాత్రం భార్యను వేధించడం మానుకోలేదు. రోజూ ఫోన్లు చేస్తూ బెదిరిస్తూ ఉండేవాడు. దీంతో చివరకు తెగించి, పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితురాలి భర్త, కుటుంబ సభ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Viral Video: పని మనిషిని లిఫ్ట్ నుంచి బలవంతంగా లాక్కెళ్లిన యజమాని.. వద్దని వేడుకుంటున్నా వినకుండా..
Updated Date - 2022-12-28T16:45:07+05:30 IST