ఏటీఎం మిషన్‌కి జిగురు పూసి మరీ.. వీళ్లు చేసిన చోరీ తెలిస్తే.. అవాక్కవుతారు..
ABN, First Publish Date - 2022-11-30T18:48:50+05:30
చోరీలు చేయడంలో దొంగలు.. ఎవరికీ అనుమానం రాకుండా కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కొన్నిసార్లు వారు చేసే నేరాలు.. పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. యూపీలో..
చోరీలు చేయడంలో దొంగలు.. ఎవరికీ అనుమానం రాకుండా కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కొన్నిసార్లు వారు చేసే నేరాలు.. పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. యూపీలో ఇలాంటి చోరీ ఒకటి వెలుగులోకి వచ్చింది. కొందరు దొంగలు ఏటీఎం మిషన్‌కి జిగురు పూసి మరీ చోరీలకు పాల్పడ్డారు. వీరి తెలివిని చూసి చివరకు పోలీసులే ముక్కున వేలేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
యూపీలోని (UP) మెయిన్‌పురిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు అంతరాష్ట్ర ముఠాకు చెందిన దుండగులు (Thieves).. స్థానికంగా ఏటీఎంలలో (ATM) నగదు తీసుకోవడానికి వచ్చే అమాయకులను టార్గెట్ చేశారు. ఏటీఎంల వద్ద మాటు వేసే ఈ దొంగలు.. ముందుగా ఏటీఎంలో కార్డు స్వైప్ చేసే స్థలంలో అతుక్కుపోయే జిగురు వంటి పదార్థాన్ని పూస్తారు. అందులో ఏటీఎం కార్డు (ATM card) పెట్టగానే అతుక్కుపోతుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న దొంగలు.. హెల్ప్‌లైన్‌కు కాల్ చేస్తున్నట్లు నటిస్తారు. తర్వాత టెక్నికల్ టీమ్ వచ్చి సాయం చేస్తారని నమ్మించి, వారిని అక్కడి నుంచి పంపించేస్తారు.
చేతులు జోడించి వేడుకున్నా వదల్లేదు.. కాలితో నోరును నొక్కి.. కర్రలతో చితకబాది..
వారు వెళ్లగానే బ్లేడ్ సాయంతో ఏటీఎం కార్డును బయటికి తీసి, ఇతర ఏటీఎంల నుంచి నగదును విత్‌డ్రా చేసుకుంటారు. ఇటీవల స్థానిక గోపాల్ నగర్‌లో ఇద్దరు వ్యక్తులను ఇలాగే మోసం చేశారు. చాలా రోజులుగా ఇలాంటి ఫిర్యాదులు వస్తుండడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. చివరకు ముఠా గుట్టును రట్టు చేశారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.75,000 నగదు, 48 ఏటీఎం కార్డులు, 65 సిమ్ కార్డులు, 2 అక్రమ పిస్టల్స్ (pistols), 6 మొబైల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన మరికొందరికి కోసం గాలిస్తున్నారు.
Updated Date - 2022-11-30T18:48:55+05:30 IST