55 ఏళ్ల ఉపాధ్యాయుడి బ్యాంక్ అకౌంట్లో రూ.21.53 లక్షలు మటాష్.. ఆయన చేసిన ఒకే ఒక్క మిస్టేక్‌తో..
ABN, First Publish Date - 2022-12-08T20:05:08+05:30
ఇటీవల ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బ్యాంకు ఖాతాలోని నగదును ఖాళీ చేసేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. తాజగా..
ఇటీవల ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బ్యాంకు ఖాతాలోని నగదును ఖాళీ చేసేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. తాజగా, ఛత్తీస్‌గఢ్‌లో ఓ 55ఏళ్ల ఉపాధ్యాయుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతడు చేసిన ఒక్క మిస్టేక్‌తో.. బ్యాంకు ఖాతాలోని రూ.21.53 లక్షలు మటాష్ అయ్యాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) బిసాల్‌పూర్ పరిధి సాయిధామ్ కాలనీకి చెందిన అమలేష్ లాహిరి అనే వ్యక్తి.. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాడు. ఇదిలావుండగా, ఇతడికి ఇటీవల టెలిగ్రామ్‌లో ఓ మెసేజ్ (Telegram message) వచ్చింది. ఇంట్లో కూర్చునే డబ్బులు పెట్టి.. ఆన్‌లైన్‌లో (Online Earning) లక్షల రూపాయలు సంపాదించే అద్భుత అవకాశం.. అని దాని సారాంశం. ఈ మెసేజ్ చూసిన టీచర్‌కు ఆశ పుట్టింది. అంతలో అతడికి మరో మెసేజ్ కూడా వచ్చింది. SEME మాల్ కంపెనీలో డబ్బు పెట్టుబడిగా పెడితే.. బోనస్ పొందే అవకాశం ఉంటుందని చెప్పి, ఓ యాప్ లింక్‌ను (App Links) పంపించారు.
ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని తన వివరాలన్నీ అందులో నమోదు చేశాడు. అందులో విడతల వారీగా పెట్టుబడులు పెడితే.. రూ.2కోట్లకు పైగా ప్రయోజనం పొందచ్చని సదరు వ్యక్తులు చెప్పారు. దీంతో టీచర్ తన బ్యాంకు ఖాతా (Bank Account) నుంచి.. యాప్‌లో క్రియేట్ చేసిన ఖాతాలోకి విడతల వారీగా రూ.21.53 లక్షల నగదును బదిలీ చేశాడు. అయితే తర్వాత నిందితులు యాప్‌లో టీచర్ బోనస్ పెరిగినట్లుగా తప్పుగా చూపించి.. రూ.2కోట్లు విత్‌డ్రా చేసుకునేందుకు పన్నులు, సర్వీస్ చార్జీల కింద మరో రూ.10లక్షలు డిపాటిట్ చేయాలంటూ కండీషన్ పెట్టారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న ఉపాధ్యాయుడు చివరకు.. పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు రాజస్థాన్‌కు చెందిన వారని గుర్తించారు.
Viral Video: నడిరోడ్డుపై ఏంటీ పనులంటూ ఈ యువతిపై నెటిజన్ల ఆగ్రహం.. అసలు కథేంటంటే..
సిబ్బందిని అక్కడకు పంపించి, ఐదు రోజుల విచారణ తర్వాత రాజస్థాన్‌లోని (Rajasthan) పాలి పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన రాహుల్ సుతార్, భినయ్‌కు చెందిన కన్హయ్యలాల్ సింధీ, రాజ్‌కుమార్ బైర్వా, గోవిందదాస్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.97లక్షల నగదు, ఆరు ఏటీఎం కార్డులు, పేటీఎం కార్డులు, చెక్‌బుక్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరి వెనుక చైనాలోని హాంకాంగ్‌కు చెందిన ముఠా ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిన మహిళ.. గ్రామానికి తిరిగొచ్చి పంచాయితీలో భర్త ఎదుటే..
Updated Date - 2022-12-08T22:55:28+05:30 IST