ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. ఇలాంటి వివాహం ఇప్పటిదాకా జరగలేదట.. అంతమంది పోలీసులు ఎందుకొచ్చారంటే..

ABN, First Publish Date - 2022-11-26T19:24:53+05:30

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా.. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కొందరికి నిజమైన స్వాతంత్ర్యం రాలేదని చెప్పొచ్చు. కొన్నిచోట్ల కులం విషయంలో దాడులు జరుగుతంటే.. మరికొన్ని చోట్ల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా.. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కొందరికి నిజమైన స్వాతంత్య్రం రాలేదని చెప్పొచ్చు. కొన్నిచోట్ల కులం విషయంలో దాడులు జరుగుతంటే.. మరికొన్ని చోట్ల అగ్రకులాల వారు ఆంక్షల పేరుతో ఇబ్బందులకు గురి చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకొచ్చిందంటే.. యూపీలోని ఓ గ్రామంలో జరిగిన వివాహం హాట్‌టాపిక్‍‌గా మారింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. ఇలాంటి వివాహం ఇప్పటిదాకా జరగలేదంటూ చర్చించుకుంటున్నారు. డజన్ల కొద్దీ పోలీసులు హాజరై.. దగ్గరుడి మరీ ఆ వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే..

Dual Sim Cards: ఒకే ఫోన్‌లో రెండు సిమ్ కార్డుల ట్రెండ్‌కు శుభం కార్డు పడబోతోందా..?

యూపీ (Uttar Pradesh) థానా జునవాయి పరిధి లోహవాయి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దళిత వర్గానికి చెందిన సంభాల్ అనే వ్యక్తి కుమార్తె రవీనాకు.. బుదౌన్ జిల్లా పాటిసా గ్రామానికి చెందిన రాంకిషన్‌తో వివాహం (marriage) నిశ్చయమైంది. కాగా, వివాహ కార్యక్రమంలో ఊరేగింపు నిర్వహించాలని వధువు తండ్రికి కోరిక ఉండేది. అయితే గ్రామంలో దళితులు తదితరులు.. వివాహ సమయాల్లో ఊరేగింపు నిర్వహించకూడదు అనే నిబంధన ఉంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఈ గ్రామంలో మాత్రం ఇప్పటికీ అదే నిబంధనకు కట్టుబడి ఉన్నారు. అయితే సంభాల్ మాత్రం ఎలాగైనా తన కుమార్తె వివాహంలో ఊరేగింపు నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు.

వైద్య విద్యకు మధ్యలోనే పులుస్టాప్.. UPSC ఫలితాల్లో నాలుగో ర్యాంక్.. ఈమె సక్సెస్ స్టోరీ ఇదీ..!

దీంతో ఏకంగా జిల్లా ఎస్పీకి (District SP) లేఖ రాశాడు. ‘‘సర్.. మా కూతురు వివాహంలో ఊరేగింపు నిర్వహించాలని అనుకున్నాం. కానీ మా గ్రామంలో దళితులు ఊరేగింపు చేయకూడదని.. అగ్రకులాల వారు ఎప్పటి నుంచో నిబంధన పెట్టారు. ఇప్పటికీ అదే ఆధిపత్యం నడుస్తోంది. మేము ఊరేగింపు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వండి’’ అని కోరుతూ లేఖ రాశాడు. ఈ లేఖపై ఎస్పీ వెంటనే స్పందించారు. సుమారు 60మంది పోలీసు (police) సిబ్బందిని గ్రామానికి పంపారు. భారీ బందోబస్తు మధ్య వరుడు రాంకిషన్‌ గుర్రంపై ఊరేగింపుగా గ్రామంలోకి వచ్చాడు. కార్యక్రమం ఘనంగా జరగడంతో వధూవరులు కుటుంబ సభ్యులు పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఊరేగింపు విషయంలో మద్దతుగా నిలిచిన ఎస్పీ చక్రేష్ మిశ్రాను ప్రజలంతా అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఊరేగింపునకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.

Viral Video: అమ్మ బాబోయ్.. పెళ్లి వేడుకలో ఇతడు వేసిన డాన్స్ చూసి బంధువులంతా రచ్చ రచ్చ..!

Updated Date - 2022-11-26T19:27:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising