ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదేళ్ల పిల్లాడికి ఏడాది నుంచి విపరీతమైన కడుపునొప్పి.. డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూస్తే కడుపులో 100 గ్రాముల పరిమాణంలో..

ABN, First Publish Date - 2022-12-02T17:02:12+05:30

వారిది నిరుపేద కుటుంబం. ఉన్నట్టుండి పదేళ్ల కొడుకు అనారోగ్యానికి గురవడంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఏడాది కాలంగా కడుపు నొప్పితో బాధపడుతుండడంతో చివరకు పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారిది నిరుపేద కుటుంబం. ఉన్నట్టుండి పదేళ్ల కొడుకు అనారోగ్యానికి గురవడంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఏడాది కాలంగా కడుపు నొప్పితో బాధపడుతుండడంతో చివరకు పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చివరకు ఎక్స్‌రే తీశారు. అయితే కడుపులో 100గ్రాముల పరిమాణంలో రాయి ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు. బీహార్‌లో వెలుగులోకి వచ్చిన ఈ అరుదైన కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

పాటలు పాడుతూ యువతులతో ప్రేమ.. నాలుగు రాష్ట్రాల్లో ఆరు వివాహాలు.. ఓ రోజు రైల్వే స్టేషన్‌లో..

బీహార్‌లోని (Bihar) వైశాలి జిల్లా హజీపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. హజీపూర్ పరిధి సెందూరి గ్రామానికి చెందిన సంజయ్ సాహ్, నిషాదేవి దంపతులకు సాహిల్ కుమార్ అనే పదేళ్ల కుమారుడు (ten years old boy) ఉన్నాడు. సంజయ్ కూలి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇదిలావుండగా, వీరి కుమారుడు సాహిల్ కుమార్.. ఏదాది కాలంగా కడుపు నొప్పితో (stomach ache) బాధపడుతున్నాడు. మధ్యలో వివిధ ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఇటీవల బాలుడి ఆరోగ్యం మరింత క్షీణించడంతో తల్లిదండ్రులు అతన్ని హజీపూర్‌లోని సదర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

Viral Video: ఫొటోలకు ఫోజులిస్తున్న నూతన వధూవరులు.. సడన్‌గా ఊహించని ఘటన.. వెనక్కు తిరిగి చూస్తే..

చిన్నారికి ఎక్స్‌రే తీసిన వైద్యులు.. మూత్రాశయంలో (Urinary bladder) 100గ్రాముల రాయి (stone) ఉన్నట్లు గుర్తించారు. దీంతో బాలుడికి ఆపరేషన్ (Operation) అవసరమని తెలిపారు. అయితే చిన్నారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో ఆలోచనలో పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఆస్పత్రి వైద్యులు సర్జన్ బసంత్ కుమార్.. ఆపరేషన్ చేయించేందుకు ముందుకొచ్చారు. చివరకు వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి, రాయిని బయటికి తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. మానవత్వంతో స్పందించిన వైద్యులు సర్జన్ బసంత్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రయాణికులతో కిక్కిరిసిన రైలు బోగీ.. సడన్‌గా కిటికీ వైపు నుంచి దూసుకొచ్చిన మృత్యువు..

Updated Date - 2022-12-02T17:02:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising