Bachelors Village: ఆ ఊళ్లో మగాళ్లకు వింత సమస్య.. 40 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు అవకపోవడం వెనుక..!
ABN, First Publish Date - 2022-11-18T21:06:35+05:30
ప్రతి గ్రామంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. కొన్ని గ్రామాల్లో కరువు తాండవిస్తే.. మరికొన్ని గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే గ్రామాల్లో వింత సమస్య నెలకొంది. ఈ ఊరి యువకులకు ..
ప్రతి గ్రామంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. కొన్ని గ్రామాల్లో కరువు తాండవిస్తే.. మరికొన్ని గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే గ్రామాల్లో వింత సమస్య నెలకొంది. ఈ ఊరి యువకులకు 40ఏళ్లు దాటినా వివాహాలు కావడం లేదు. పెళ్లిళ్లు కాక కొందరు ఇబ్బంది పడుతుంటే.. వివాహం అయ్యాక భార్యలు వదిలేసి వెళ్లడంతో మరికొందరు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు కారణం ఏంటా అని ఆరాతీస్తే.. వింత సమస్య వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
Viral Video: పారిపోతున్న పామును పిలిచిమరీ కెలికాడు.. చివరికి ఏమయ్యిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) చిత్రకూట్ పరిధిలోని సుమారు పది గ్రామాల ప్రజలు వింత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామాల యువకులకు 40ఏళ్లు దాటినా వివాహాలు (marriages) కావడం లేదు. ఒకవేళ్ల కొందరికి అయినా మహిళలు మధ్యలోనే భర్తలను వదిలి వెళ్లిపోతున్నారు. ఇందుకు కారణం ఏంటనే వివరాల్లోకి వెళితే.. ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నీటి సమస్య (Water problem) కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. రోజులో సగ భాగం కేవలం నీటి సేకరణకే సమయం వెచ్చించాల్సి వస్తోంది. అది కూడా కిలోమీటర్ల దూరం నడిచి, బావుల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ప్రధానంగా మూడు గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Viral Video: సైకిల్‌పై తొమ్మిది మంది పిల్లలతో జాలీ రైడ్.. చిన్నారుల బ్యాలెన్స్ చూస్తే..
మాణిక్‌పూర్ పరిధిలోని గోపీపూర్ గ్రామంలో 5000మంది జనాభా ఉన్నారు. ఇందులో 50% యువకులు బ్రహ్మచారులుగా (bachelor) మిగిలిపోయారు. 250కుటుంబాలు ఉన్న ఈ గ్రామం.. కేవలం ఒకే ఒక్క బావి నీటిపై ఆధారపడింది. అది కూడా గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో ఈ గ్రామ యువకులకు ఆడపిల్లను ఇవ్వాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. గ్రామానికి చెందిన వినయ్ యాదవ్ అనే యువకుడు నలుగురు సోదరుల్లో ఒకడు. మిగిలిన ముగ్గురు సోదరులు ఊరు వదిలి పని వెతుక్కుంటూ వేరే ప్రాంతానికి వెళ్లారు. దీంతో వారికి వివాహాలు అయ్యాయి. కానీ వినయ్ మాత్రం వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోనే ఉండిపోయాడు. 35ఏళ్లు వచ్చినా ఇతడికి వివాహం కాలేదు.
దోపిడీ దొంగల వెరైటీ రూటు.. సెంటిమెంట్ డైలాగ్స్‌తో బ్యాంకు ఉద్యోగులను కదలకుండా చేసి మరీ..!
ఇక చిత్రకూట్ పరిధిలో అత్యంత వెనుకబడిన గ్రామాల్లో (backward area) కరోన్హా పంచాయతి ఒకటి. 7,500మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో నీటి సమస్య తిష్టవేసింది. ఇక్కడ 11చేతి బోర్లు ఉండగా.. ప్రస్తుతం ఒకటి మాత్రమే పని చేస్తోంది. అందులోనూ నీరు అంతంతమాత్రమే. దీంతో ఊరికి సమీపంలో ఉన్న బావి నుంచి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. స్థానికంగా నివాసం ఉంటున్న బధ్కా అనే వ్యక్తికి 48 ఏళ్లు వచ్చినా వివాహం కాలేదు. ఇతడి ఇద్దరు సోదరులు బయట ప్రాంతంలో ఉద్యోగాలు చేయడం వల్ల.. వారికి వివాహాలు అయ్యాయి. బధ్కా మాట్లాడుతూ తనకు చాలా సంబంధాలు వచ్చాయని, అయితే నీటి సమస్య కారణంగా తాను బ్రహ్మచారిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
నాకీ పెళ్లొద్దంటూ వరుడు గొడవ.. అమ్మాయి తల్లిదండ్రులు నిలదీస్తే అతడు చెప్పిన కారణం విని..
చిట్‌ఘటి అనే గ్రామంలో 400మంది నివసిస్తున్నారు. నీటి సమస్య కారణంగా పదేళ్లుగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల క్రితం గ్రామంలో నాలుగు చేతిబోర్లు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం అన్నింటిలోనూ నీరు అడుగంటింది. దీంతో ప్రస్తుతం మహిళలు గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోని బావి నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు నీటి కోసం చిన్నపాటి యుద్ధాలే జరుగుతుంటాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన చిరాయి అనే వ్యక్తికి 32ఏళ్లు వచ్చినా వివాహం కాకపోవడంతో ఊరు విడిచి పంజాబ్ వెళ్లిపోయాడు. గ్రామంలో చాలా మంది మహిళలు.. తమ భర్తలను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయినట్లు తెలిసింది. స్థానిక గోపీపూర్కు చెందిన 52ఏళ్ల ప్రసాద్ భార్య.. రెండేళ్ల క్రితం భర్తను వదిలి వెళ్లిపోయిందని గ్రామస్తులు తెలిపారు.
ఆ ఇంటివాళ్లు డిన్నర్ చేస్తుంటే, తన డిన్నర్ మెనూలో వాళ్లనే ఎంచుకుందట…
చిత్రకూట్ పరిధిలోని గోపీపూర్, జరోమాఫీ, మార్కుండి, సర్హత్, గిదుర్హా, కోట కండెల, చిట్‌ఘటి, రాణిపూర్ కళ్యాణ్‌గఢ్, చురేహ్ కేశరువా, ఎల్హా బధేహ గ్రామాల్లో మొత్తం 57 చేతిపంపులు ఉన్నాయి. అయితే వీటిలో ఏడు బోర్లలో మాత్రమే నీరు వస్తుంది. ఈ ప్రాంతాల్లో వర్షపాతం అతి తక్కువగా నమోదవుతూ ఉంటుంది. ఈ కారణంగా 40శాతం చేతిబోర్లు, బావుల్లో నీటి మట్టం పడిపోయింది. ఇక్కడి భూమిలో చాలా వరకూ బండలు ఉండడంతో బోర్లు వేయడం కూడా కష్టతరంగా మారిందని అధికారులు చెబుతున్నారు. దీంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. నవంబర్‌లో గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాగ్ శ్రీవాస్తవ ఈ గ్రామాలను సందర్శించారు. నీటి సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. స్థానికులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో గ్రామాలకు వచ్చే నాయకులు హామీలు గుప్పిస్తుంటారని.. అనంతరం తమ వైపు కన్నెత్తి కూడా చూడరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నా భార్యను చంపేశా.. వచ్చి అరెస్ట్ చేసుకోండంటూ నేరుగా పోలీసులకే ఫోన్ చేసిన భర్త..!
Updated Date - 2022-11-18T21:12:22+05:30 IST