ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బైక్‌‌పై వెళ్తూ ప్రేయసి ఇన్‌స్టా రీల్స్.. సడన్‌గా వెనక్కు తిరిగిన ప్రియుడికి మైండ్‌బ్లాక్..!

ABN, First Publish Date - 2022-11-10T15:56:45+05:30

ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా.. ఆఖరికి భోజనం చేసే సమయంలోనూ రీల్స్ చేయడం నేటి యువతకు హాబీగా మారిపోయింది. రీల్స్ చేసే సమయంలో తమని తామే మర్చిపోతుంటారు. ఏ పరిస్థితుల్లో ఉన్నాం.. పక్కన ఎవరున్నారు.. అన్న విషయాలు కూడా పట్టించుకోరు. ఇక..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా.. ఆఖరికి భోజనం చేసే సమయంలోనూ రీల్స్ చేయడం నేటి యువతకు హాబీగా మారిపోయింది. రీల్స్ చేసే సమయంలో తమని తామే మర్చిపోతుంటారు. ఏ పరిస్థితుల్లో ఉన్నాం.. పక్కన ఎవరున్నారు.. అన్న విషయాలు కూడా పట్టించుకోరు. ఇక ప్రేమికుల (lovers) గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. ఓ యువతి ప్రియుడితో పాటూ బైకుపై వెళ్తూ ఇన్‌స్టా రీల్స్ చేసే పనిలో మునిగిపోయింది. సడన్‌గా వెనక్కు తిరిగిన ప్రియుడికి మైండ్ బ్లాక్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: చాక్ పీస్‌తో ఈ యువతి వేసిన పెయింటింగ్ చూస్తే.. మతి పోవాల్సిందే..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో తెగ వైరల్ (Instagram viral videos) అవుతోంది. ఓ ప్రేమ జంట బైకుపై వెళ్తుంటుంది. ఆ సమయంలోనూ వెనుక ఉన్న యువతి ఇన్‌స్టా రీల్స్ (Insta reels) చేస్తూ బిజీగా ఉంటుంది. బైక్ డ్రైవ్ చేస్తున్న ప్రియుడిని వెనక్కు తిరిగి చూడమని కోరుతుంది. అయినా అతను డ్రైవింగ్ మీద దృష్టి పెట్టి ఉండడంతో పట్టించుకోడు. అయినా పదే పదే వెనక్కు తిరిగి చూడమని కోరుతుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కసారి వెనక్కు తిరిగి ఒకే ఒక్క చిరునవ్వు నవ్వుతాడు. అంతే మరుక్షణంలో కెమెరా బ్లర్ అవుతుంది. ఏం జరిగిందా అనే కంగారులో ఉండగానే.. హాయ్.. ఫ్రెండ్స్.. వీడిని నమ్మి వస్తే.. ఇలా చేశాడు.. అని నేరమంతా ప్రియుడిపై మోపుతుంది. అంతలో రోడ్డు పక్కన పడిపోయిన యువకుడు.. హమ్మయ్య అనుకుంటూ పైకి లేచి, నీ ఇన్‌స్టా రీల్స్.. నా చావుకొచ్చాయ్.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

కూతురు ప్రేమ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు.. మూడేళ్లుగా ఇంట్లో చేసిన నిర్వాకం.. సడన్‌గా..

Updated Date - 2022-11-10T16:16:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising