Viral Video: అన్న కోసం చెల్లెలు త్యాగం చేస్తే.. చివరకు ఈ అన్న ఏం చేశాడో చూడండి..
ABN, First Publish Date - 2022-11-24T21:28:04+05:30
చిన్న పిల్లలు చాలా మంది చాలా మొండిగా ఉంటారు. ఇక వారి అల్లరికి అడ్డూఅదుపూ అంటూ ఉండదు. అలాగే తమకు కావాల్సిన ఆహారం విషయంలోనూ తల్లిదండ్రులతో బెట్టు చేయడం, ఒక్కోసారి ..
చిన్న పిల్లలు చాలా మంది చాలా మొండిగా ఉంటారు. ఇక వారి అల్లరికి అడ్డూఅదుపూ అంటూ ఉండదు. అలాగే తమకు కావాల్సిన ఆహారం విషయంలోనూ తల్లిదండ్రులతో బెట్టు చేయడం, ఒక్కోసారి సోదరులతో గొడవ పడడం చూస్తుంటాం. తమకు ఇష్టమైన తిండి విషయంలో నానా రచ్చ చేస్తుంటారు. అయితే మరి కొందరు పిల్లలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. అలాంటి అన్నాచెల్లెళ్లకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ చిన్నారి చెల్లెలు తన అన్న కోసం తాను తినే ఆహారాన్ని త్యాగం చేసింది. అయితే ఈ అన్న మాత్రం చివరకు అంతకంటే ఎక్కువ ప్రేమ చూపించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
కూతురు తొలి పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు.. సొంతూరుకు వస్తుండగా సడన్‌గా..
ట్విట్టర్‌లో ఓ వీడియో తెగ వైరల్ (Twitter viral videos) అవుతోంది. అన్నాచెల్లెళ్లు టేబుల్ వద్ద కూర్చుని తిరు తిండి తింటూ ఉంటారు. ఎదురుగా రెండు పాత్రల్లో ఆహారం ఉంటుంది. అందులో ఓ పాత్రలో ఒకే ఒక వడ లాంటి పదార్థం ఉంటుంది. దాన్ని ముందుగా చెల్లెలు తీసుకుంటుంది. పక్కనే ఫోన్ చూసుకుంటూ ఉన్న అన్న.. అప్పుడే అదే ఆహారం కోసం ఓవైపు ఫోన్ చూసుకుంటూ మరోవైపు చేతులు ప్లేట్‌లోకి పెట్టడాన్ని చెల్లెలు గమనిస్తుంది. అన్న కోసం తాను త్యాగం చేసి.. తీసుకున్న ఆహారాన్ని మళ్లీ అక్కడే పెడుతుంది. ఆ ఆహారాన్ని తీసుకున్న అన్న.. దాన్ని సాస్‌లో ముంచి, చెల్లెలు బౌల్‌లో పెడతాడు. నీ కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు చెల్లెమ్మ.. అన్నట్లుగా ఆ అన్న ఎక్స్‌ప్రెషన్ ఇవ్వగా.. థ్యాంక్స్ అన్నా అంటూ చిన్నారి చెల్లెలు తన సోదరుడికి ముద్దు పెడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగంతో కూడిన కామెంట్లు పెడుతున్నారు. ఈ అన్నాచెల్లెళ్ల అనుబంధం చూస్తుంటే.. రెండు కళ్లూ చాలట్లేదు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
5 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. 5 సార్లు గుంజీళ్లు తీయించి వదిలేశారు..!
Updated Date - 2022-11-24T21:28:13+05:30 IST